త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ఆర్‌సీబీపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం..

IPL 2026 | ఆర్‌సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

P

Sports | Published On Apr 18, 2026, 7.57 pm IST

IPL 2026 | ఆర్‌సీబీపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం..
Advertisement

IPL 2026 | ఆర్‌సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విజ‌యంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ కీలక పాత్ర పోషించారు. రాహుల్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల స‌హాయంతో 57 పరుగులు చేసి శుభారంభం అందించాడు.

రాహుల్ అవుట్ అయ్యాక స్టబ్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. స్టబ్స్ అజేయంగా 47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స‌ర్ స‌హాయంతో 60 పరుగులు చేసి జట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేశాడు. మిల్లర్ కేవలం 10 బంతుల్లోనే ఫోర్‌, రెండు సిక్స‌ర్ల స‌హాయంతో 22 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీశారు. క్రునాల్ పాండ్యా ఒక వికెట్ వికెట్ ద‌క్కింది. ఈ విజ‌యంతో ఢిల్లీ ఆరు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్‌సీబీ ఆరు మ్యాచుల్లో నాలుగు విజ‌యాల‌తో రెండోస్థానంలో ఉంది.

Advertisement
Advertisement