Ayush Mhatre | సీఎస్‌కే అభిమానులకు షాక్.. గాయంతో టోర్నీ నుంచి అవుట్..?
Ayush Mhatre | చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాక్ న్యూస్. యువ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మాత్రే గాయపడ్డారు. గాయంపై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక వివరాలు వెల్లడించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా హ్యామ్‌స్ట్రింగ్ గాయమైందని, తీవ్రత తెలియదని పేర్కొన్నారు.
Ayush Mhatre | చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాక్ న్యూస్. యువ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మాత్రే గాయపడ్డారు. గాయంపై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక వివరాలు వెల్లడించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా హ్యామ్‌స్ట్రింగ్ గాయమైందని, తీవ్రత తెలియదని పేర్కొన్నారు. హ్యామ్‌స్ట్రింగ్ టియర్ అయ్యిందని, ఎంత తీవ్రంగా ఉందో ఇప్పుడే చెప్పలేనన్నారు. సోమవారం స్కాన్ చేయాల్సి ఉంటుందని.. పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని హస్సీ విలేకరుల సమావేశంలో తెలిపాడు. ఆయుష్ మాత్రే జట్టుకు పెద్ద లోటు అని హస్సీ అన్నారు. మాత్రే మంచి ఫామ్‌లో ఉన్నాడని, జట్టుకు దూరం కానుండడం తీరని లోటన్నారు. అదే సమయంలో ఇతర యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుండడం సానుకూల అంశమన్నారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, వారికి ఇది మంచి అవకాశమన్నారు.
ఇదిలా ఉండగా.. శనివారం హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. 195 టార్గెట్‌తో సీఎస్‌కే బరిలోకి దిగింది. సంజూ శాంసన్ వికెట్ తర్వాత ఇంపాక్ట్ సబ్‌గా గుర్జప్నీత్ సింగ్ స్థానంలో అయుష్ మాత్రే రెండో ఓవర్‌లోనే క్రీజ్‌లోకి వచ్చాడు. 18 ఏళ్ల ఈ యువ ఆటగాడు మంచి ఫామ్ చూపిస్తూ 13 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఐదో ఓవర్ రెండో బంతి తర్వాత రెండో రన్ తీసే ప్రయత్నంలో హ్యామ్‌స్ట్రింగ్ అయ్యింది. రన్ పూర్తి చేసిన వెంటనే నొప్పితో కూలబడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. గాయమైనా మైదానం వీడకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పెవిలియన్‌కు చేరాడు. సీఎస్‌కే జట్టులో ఇప్పటికే పలువురు ప్లేయర్లు గాయపడ్డారు. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ టోర్నమెంట్‌కు దూరమయ్యారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా కాల్ఫ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఈ సీజన్‌లో వారి నాలుగో మ్యాచ్‌లో ఆరో ఓటమి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్‌కే ఏడో స్థానంలో ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






