Mohammed Shami | ఎన్నికల అధికారుల ఎదుట హాజరైన మహ్మద్ షమీ..
Mohammed Shami | టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మంగళవారం ఎన్నికల అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఇటీవల ఈసీ నోటీసులు పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Mohammed Shami | టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మంగళవారం ఎన్నికల అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఇటీవల ఈసీ నోటీసులు పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జనాభా గణన ఫారంలో సంతానం వివరాల కాలమ్ ఖాళీగా వదిలేయడంతో విచారణకు హాజరు కావాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో కోల్‌కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలోని పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరై, పత్రాలను అధికారులకు అందించాడు.
ఎస్‌ఐఆర్ దరఖాస్తులో మహ్మద్ షమీ పేర్కొన్న వివరాల్లో కొన్ని చోట్ల వ్యత్యాసాలు కనిపించాయని, అందుకే విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదివరకే ఓసారి నోటీసులు ఇచ్చినప్పటికీ.. క్రికెట్ మ్యాచ్ కారణంగా మరోసారి అవకాశం ఇచ్చామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ.. క్రికెట్ కోసం కోల్‌కతాలో ఉంటున్నాడు. 93వ వార్డులో ఓటరుగా నమోదు చేసుకున్నాడు. ఈ వార్డు రాస్‌బిహారీ అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ అధికారులు పిలిచిన సమయంలో రావడం తన బాధ్యతని.. మళ్లీ పిలిచా రావడంలో తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. విచారణ చక్కగానే సాగిందని షమీ తెలిపాడు.
ఇదిలా ఉండగా.. సర్‌పై ఇటీవల నగరంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారం ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని కొన్ని విచారణ కేంద్రాలపై నిరసనకారులు దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ కేంద్రాలలో విచారణ తిరిగి ప్రారంభమైంది. విచారణతో వేధించేందుకే సర్ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ నెల 27న పార్టీ నాయకులతో కలిసి బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారిని కలువనున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






