Sabarimala Temple | శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. ఫిబ్రవరిలో తెరుచుకోనున్న ద్వారాలు..!
Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయం మంగళవారం మూతపడింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ అయ్యప్పను దర్శించుకున్నాక మూసివేసినట్లు తెలిపారు.
Devotional | Published On Jan 20, 2026, 9.50 pm IST
Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయం మంగళవారం మూతపడింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ అయ్యప్పను దర్శించుకున్నాక మూసివేసినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయంలో నిత్యక్రతువులు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం తూర్పు మండపంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం పవిత్ర త్రివాభరణం తిరుగు ప్రయాణం మొదలైంది. 30 మంది సభ్యులతో కూడిన బృందం, పెరియస్వామి మరుతువన శివంకుట్టి నేతృత్వంలో పవిత్ర ఆభరణాలను అదే మార్గంలో పందలం శ్రీంబిక్కల్ ప్యాలెస్‌కు తీసుకెళ్లనున్నారు. ఈ బృందం జనవరి 23న పందలం చేరుకుంటుందని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.
మండల-మకరవిలక్కు సందర్భంగా దాదాపు రెండునెలలకుపైగా ఆలయాన్ని తెరిచారు. చివరి రోజున ప్రధాన పూజారి ఈడీ ప్రసాద్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం నిర్వహించారు. విగ్రహాన్ని రుద్రాక్ష మాలతో అలంకరించారు. అలాగే, యోగ దండాన్ని స్వామివారి చేతిలో ఉంచారు. చివరగా హరివరాసనం గానం అనంతరం దీపాలను ఆర్పివేసి గర్భాలయ ద్వారాలను మూసివేశారు. సంప్రదాయం మేరకు ఆలయ తాళంచెవిలను పందలం రాజకుటుంబ ప్రతినిధికి అప్పగించారు. ఆయన 18 మెట్లు దిగి, సంప్రదాయ ఆచారాలు పూర్తి చేసి, పరిపాలన అధికారి శ్రీనివాసన్‌కు అందించారు. ఇదిలా ఉండగా.. ఈ సారి సీజన్‌లో లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తారు. ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరిలో జరిగే పూజల కోసం తెరువనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కుంభం మాసపు పూజలు ఫిబ్రవరి 12న తేదీ సాయంత్రం 5 గంటలకు 17న రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. ఈ రోజుల్లోనే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉంటుందని, దర్శనం టోకెన్లు, ఆన్‌లైన్ బుకింగ్, భద్రతా ఏర్పాట్లు గతం మాదిరిగానే ఉంటాయని వివరించారు.
సంబంధిత వార్తలు

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
జులై 14, 2026

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
జులై 11, 2026

Heavy Rain | దేశవ్యాప్తంగా ముంచెత్తిన భారీ వర్షాలు.. నీట మునిగిన ఢిల్లీ.. కశ్మీర్, కేరళ అతలాకుతలం
జులై 9, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | బావ, బామ్మర్దులకు గతం లేదు.. భవిష్యత్తూ లేదు : భట్టి విక్రమార్క
- ●Sonam Wangchuk | సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష - బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు - కారణం ఇదే!
- ●Bengaluru Restaurants | బెంగళూరులో ఫుట్‌బాల్ ఫీవర్: అర్ధరాత్రి దాటాక 3.30 వరకు రెస్టారెంట్లకు పర్మిషన్!
- ●Ashada Masam 2026 | రేపట్నుంచే ఆషాఢం.. పుట్టింటి బాటలో కొత్త పెళ్లి కూతుళ్లు..! ఇక ఆ కార్యానికి దూరమేనా..?
- ●Shah Rukh Khan | షారుఖ్ ఖాన్‌కు సుప్రీంకోర్టు ఊరట - మన్నత్పై కీలక తీర్పు
- ●CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!

Bhatti Vikramarka | బావ, బామ్మర్దులకు గతం లేదు.. భవిష్యత్తూ లేదు : భట్టి విక్రమార్క

Sonam Wangchuk | సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష - బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు - కారణం ఇదే!

Bengaluru Restaurants | బెంగళూరులో ఫుట్‌బాల్ ఫీవర్: అర్ధరాత్రి దాటాక 3.30 వరకు రెస్టారెంట్లకు పర్మిషన్!

Ashada Masam 2026 | రేపట్నుంచే ఆషాఢం.. పుట్టింటి బాటలో కొత్త పెళ్లి కూతుళ్లు..! ఇక ఆ కార్యానికి దూరమేనా..?



