Yuzvendra Chahal | యజ్‌వేంద్ర చాహల్‌పై నెటిజన్ల ఆగ్రహం.. దుమారం రేపుతున్న వీడియో..
Yuzvendra Chahal | పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ యజ్‌వేంద్ర చాహల్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియోలో చాహల్ సిగరెట్ తాగిన అనంతరం దాన్ని కారులోంచి కిందకు పడేసినట్లు దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చాహల్ అవునా, కాదా అన్న వివరాలపై స్పష్టత రాలేదు.
Yuzvendra Chahal | పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ యజ్‌వేంద్ర చాహల్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియోలో చాహల్ సిగరెట్ తాగిన అనంతరం దాన్ని కారులోంచి కిందకు పడేసినట్లు దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చాహల్ అవునా, కాదా అన్న వివరాలపై స్పష్టత రాలేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం అతను చాహల్ అని పేర్కొంటూ నెటిజన్లు అతనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగడమే కాకుండా, సెన్స్ లేకుండా దాన్ని రోడ్డుపై పడేస్తావా.. అంటూ అతనిపై మండిపడుతున్నారు.
మద్యం మానేశా: చాహల్
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న చాహల్ ఇటీవల సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మద్యం సేవించడం పూర్తిగా మానేశానని తెలిపాడు. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి కూడా విషయాలను పంచుకున్నాడు. తాను మద్యం తాగడం పూర్తి మానేశానని, ఆ విషయం జరిగి 6 నెలలు దాటిపోయిందని తెలిపాడు. తనకు ఇప్పుడు 35 ఏళ్లని, అందువల్ల మరింత యాక్టివ్‌గా ఉండాలని, జట్టుకు 150 శాతం ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపాడు. సీనియర్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో ఉన్నవాళ్లు తనను చూసి ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారని తెలిపాడు.
https://twitter.com/mukesh1275/status/2042910331115311599
టీమిండియాలో దక్కని చోటు..
గత ఐపీఎల్ సీజన్‌లో చాహల్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచింది. అయితే ఐపీఎల్‌లో ఆకట్టుకున్నా చాహల్ మాత్రం తరువాత టీమిండియాలో చోటు సంపాదించలేకపోయాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ గురించి మాట్లాడుతూ ఈ సీజన్‌లో టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలిపాడు. మరింత ఫిట్‌నెస్, ఆత్మ విశ్వాసంతో ప్రతి మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని, అయితే ఫైనల్‌లో పరాజయం తనను తీవ్రంగా నిరాశకు గురి చేసిందని చాహల్ పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో ఆకట్టుకోని చాహల్..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కోల్‌కతాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఆ జట్టుతో పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. లేదంటే పంజాబ్ పట్టికలో అగ్ర స్థానంలో ఉండేది. ఇప్పటి వరకు పంజాబ్ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తాజాగా సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్ అదరగొట్టింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని అలవోగా ఛేదించింది. ఇక ఈ సీజన్‌లో చాహల్ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లలో ఆడగా కేవలం 3 వికెట్లే తీశాడు. భారీగా పరుగులను సమర్పించుకున్నాడు. అయితే తాజాగా జరిగిన సిగరెట్ సంఘటనపై చాహల్ లేదా అతని టీమ్ ఇంకా స్పందించలేదు.
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Preity Zinta | ఎనిమిదేళ్ల తర్వాత కెమెరా ముందుకు ఐపీఎల్ ఓనర్ – వైబ్‌తో రీఎంట్రీ
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



