త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ 2026.. బంగ్లాదేశ్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటుందా..?

T20 World Cup 2026 | భార‌త్‌, శ్రీ‌లంక వేదిక‌లుగా ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ 2026 కు గాను భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఇప్ప‌టికే నిరాక‌రించిన విషయం తెలిసిందే. ఆ దేశ క్రికెట్ బోర్డు తాజాగా నిర్వ‌హించిన స‌మావేశంలో ఐసీసీకి మ‌రోమారు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

S

Sports | Published On Jan 16, 2026, 8.48 am IST

T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ 2026.. బంగ్లాదేశ్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటుందా..?
Advertisement

T20 World Cup 2026 | భార‌త్‌, శ్రీ‌లంక వేదిక‌లుగా ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ 2026 కు గాను భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఇప్ప‌టికే నిరాక‌రించిన విషయం తెలిసిందే. ఆ దేశ క్రికెట్ బోర్డు తాజాగా నిర్వ‌హించిన స‌మావేశంలో ఐసీసీకి మ‌రోమారు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. అయితే ఈ విషయంలో బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఐసీసీ ఆ స‌మావేశంలో కోరినప్పటికీ, బీసీబీ మాత్రం తన వైఖరిని మార్చుకునేందుకు నిరాకరించింది. ఈ క్ర‌మంలో మొత్తం వ్య‌వ‌హారంపై ఇప్పటివరకు బీసీసీఐ మౌనంగా ఉండగా, తాజాగా కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ అంశంపై స్పందించారు.

వైఖ‌రిని మార్చుకోని బీసీబీ..

మీడియా సంస్థ‌ల‌తో దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఐసీసీ, బీసీబీ మధ్య జరిగిన ఎలాంటి లేఖా వ్యవహారాలపై బీసీసీఐకి సమాచారం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ మధ్య జరిగిన సంభాషణల గురించి బీసీసీఐకి ఎలాంటి సమాచారం లేదు. అందువల్ల ఈ అంశంపై మాకు స్పష్టత లేదు. మాకు అధికారికంగా సమాచారం అందిన వెంటనే తెలియజేస్తాం.. అని ఆయ‌న అన్నారు. కాగా డిసెంబర్ 13న విడుదల చేసిన ప్రకటనలో, భారత్‌కు రావడానికి నిరాకరించిన తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఐసీసీ కోరిందని బీసీబీ వెల్లడించింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ వైఖరి మారదని బంగ్లాదేశ్ బోర్డు మ‌ళ్లీ స్పష్టం చేసింది.

బీసీబీ ముందు కేవ‌లం రెండే ఆప్ష‌న్లు..?

చర్చల సందర్భంగా భారత్‌కు ప్రయాణించకూడదన్న మా నిర్ణయాన్ని మేము పునరుద్ఘాటించాం. భద్రతా ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని ఐసీసీని కోరాం.. అని బీసీబీ ప్రకటనలో పేర్కొంది. అయితే, టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని, బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఐసీసీ మరోసారి సూచించింది. కానీ బీసీబీ తన వైఖరిని మార్చుకోలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై పరిష్కారం కనుగొనేంత వ‌రకు చర్చలు కొనసాగుతాయని ఐసీసీతోపాటు బీసీబీ కూడా వెల్ల‌డించింది. అయితే టోర్నీ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండడంతో బీసీబీ ముందు కేవ‌లం రెండే ఆప్ష‌న్లు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటే పెను సంక్షోభం..?

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే పూర్త‌యింది క‌నుక ప్ర‌స్తుతానికి దాన్ని మార్చ‌డం క‌ష్ట‌మని భావించిన ఐసీసీ.. బీసీబీకి ఇప్ప‌టికే ప‌లు మార్లు విజ్ఞ‌ప్తి చేసింది. కానీ వారు అంగీక‌రించ‌డం లేదు. అయితే తేదీ ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ షెడ్యూల్‌ను మార్చ‌డం ఇక కుద‌ర‌ని ప‌ని. చాలా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది క‌నుక షెడ్యూల్‌ను ఇక అస‌లు మార్చ‌లేరు. మ‌రోవైపు చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఇరు ప‌క్షాలు చెబుతున్నాయి. ఇది ఇంకా ఇలాగే ఆల‌స్యం అయితే అప్పుడు అసలు షెడ్యూల్‌ను మార్చ‌డానికి అస‌లే వీలుండ‌దు. అలాంట‌ప్పుడు బీసీబీ ఎదుట రెండే ఆప్ష‌న్లు ఉంటాయి. ఒక‌టి, టోర్నీలో ఆడ‌డం లేదా త‌ప్పుకోవ‌డం. వారు ఆడితే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. కానీ బీసీబీ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటే వారు ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ లో క‌నిపించ‌రు. వారి మ్యాచ్‌ల‌కు గాను ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు గెలిచిన‌ట్లు పాయింట్లు ఇస్తారు. క‌థ అక్క‌డితో ముగుస్తుంది. కానీ బీసీబీ తీరుపై ఇప్ప‌టికే ఆ దేశ క్రికెట‌ర్లు గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి వారికి వ్య‌తిరేకంగా బీసీబీ వెళ్తుందా, రాజీ ప‌డి ఎలాగో టోర్నీని ముగుస్తుందా.. అన్న‌ది మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది. కానీ బీసీబీ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం అది చాలా మంది ప్లేయ‌ర్ల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు, అలాంట‌ప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్‌లో పెను సంక్షోభం సంభ‌వించే అవ‌కాశాలు ఉంటాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement