త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | గుజ‌రాత్‌పై భారీ స్కోరును ఛేజ్ చేసి గెలిచిన ముంబై.. వ‌రుస‌గా రెండో విజ‌యం..

WPL 2026 | ముంబై ఇండియన్స్ మహిళల జట్టు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి మ్యాచ్ లో ఓడినప్పటికీ రెండు వరుస మ్యాచ్ లలో గెలిచి తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుతో మ్యాచ్ లో ముంబై అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత ఢిల్లీ తో, తాజాగా గుజరాత్ తో మ్యాచ్ లలో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసింది.

S

Sports | Published On Jan 14, 2026, 6.43 am IST

WPL 2026 | గుజ‌రాత్‌పై భారీ స్కోరును ఛేజ్ చేసి గెలిచిన ముంబై.. వ‌రుస‌గా రెండో విజ‌యం..
Advertisement

WPL 2026 | ముంబై ఇండియన్స్ మహిళల జట్టు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి మ్యాచ్ లో ఓడినప్పటికీ రెండు వరుస మ్యాచ్ లలో గెలిచి తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుతో మ్యాచ్ లో ముంబై అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత ఢిల్లీ తో, తాజాగా గుజరాత్ తో మ్యాచ్ లలో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకునేందుకు యత్నిస్తోంది. లేటెస్ట్ గా డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జ‌యాంట్స్ వుమెన్‌ తో జ‌రిగిన‌ మ్యాచ్ లో రికార్డు స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈక్రమంలోనే గుజరాత్ పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా గుజరాత్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 192 పరుగులు చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో భారీ స్కోరు ఎవరూ చేయలేదు. కానీ ప్లేయర్లు అందరూ సమిష్టిగా రాణించారు. జార్జియా వేర్హమ్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 43 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలవగా మరో ప్లేయర్ భారతి ఫుల్మలి 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచింది. అలాగే ఓపెనర్ బెత్ మూనీ (33), మరో ప్లేయర్ కనిక అహుజ (35) కూడా రాణించారు. దీంతో గుజరాత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక ముంబై బౌలర్లలో షబ్నం ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, నికోలా కేరీ, అమేలియా కర్ లకు తలా ఒక వికెట్ దక్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ముంబై వుమెన్స్ జ‌ట్టు ఆరంభంలోనే 2 వికెట్ల‌ను కోల్పోయింది. అయినప్ప‌టికీ ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన అమ‌న్‌జోత్ కౌర్‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, నికోలా కేరీ చెల‌రేగిపోయారు. ఏ ద‌శ‌లోనూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ప‌రుగుల‌ను పిండుతూనే వ‌చ్చారు. ఈ క్ర‌మంలో హ‌ర్మ‌న్ ప్రీత్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 71 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచింది. అలాగే అమ‌న్‌జోత్ కౌర్ (26 బంతుల్లో 40, 7 ఫోర్లు), నికోలా కేరీ (23 బంతుల్లో 38, 6 ఫోర్లు) సైతం చ‌క్క‌ని ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్ర‌మంలో ముంబై వుమెన్స్ జ‌ట్టు 19.2 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌ను కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. 193 ప‌రుగులు చేసింది. ఇక గుజ‌రాత్ వుమెన్స్ టీమ్ బౌల‌ర్ల‌లో రేణుకా సింగ్‌, క‌శ్వీ గౌతం, సోఫీ డివైన్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

Advertisement

తాజావార్తలు

Advertisement