త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mens Under-19 World Cup | మెన్స్ అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. యూఎస్ఏపై భార‌త్ ఘ‌న విజ‌యం..

Mens Under-19 World Cup | బుల‌వాయో వేదికగా జ‌రిగిన మెన్స్ అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ మొద‌టి మ్యాచ్‌లో యూఎస్ఏపై భార‌త్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అద్భుత‌మైన బౌలింగ్‌తో యూఎస్ఏను భార‌త బౌల‌ర్లు క‌ట్ట‌డి చేయ‌గా ఆ జట్టు స్వ‌ల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ సునాయాసంగానే విజ‌యం సాధించింది.

S

Sports | Published On Jan 15, 2026, 8.03 pm IST

Mens Under-19 World Cup | మెన్స్ అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. యూఎస్ఏపై భార‌త్ ఘ‌న విజ‌యం..
Advertisement

Mens Under-19 World Cup | బుల‌వాయో వేదికగా జ‌రిగిన మెన్స్ అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ మొద‌టి మ్యాచ్‌లో యూఎస్ఏపై భార‌త్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అద్భుత‌మైన బౌలింగ్‌తో యూఎస్ఏను భార‌త బౌల‌ర్లు క‌ట్ట‌డి చేయ‌గా ఆ జట్టు స్వ‌ల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ సునాయాసంగానే విజ‌యం సాధించింది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో త‌న తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా యూఎస్ఏ అండ‌ర్-19 జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో యూఎస్ఏ నిర్ణీత 50 ఓవ‌ర్లు కూడా ఆడకుండానే 35.2 ఓవ‌ర్ల‌లోనే కేవ‌లం 107 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. యూఎస్ఏ ప్లేయ‌ర్ల‌లో కేవ‌లం నితీష్ సూదిని (52 బంతుల్లో 36, 4 ఫోర్లు) ఒక్క‌డే కాసేపు క్రీజులో నిలిచాడు. మిగిలిన ప్లేయ‌ర్ల‌లో చాలా మంది కేవ‌లం సింగిల్ డిజిట్ స్కోరుకే ప‌రిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో హెనిల్ ప‌టేల్ 5 వికెట్లు ప‌డ‌గొట్టి యూఎస్ఏ ప‌త‌నాన్ని శాసించాడు. అలాగే దీపేష్ దేవేంద్ర‌న్‌, ఆర్ఎస్ అంబ్రీష్‌, ఖిల‌న్ ప‌టేల్‌, వైభ‌వ్ సూర్య‌వంశీలు త‌లా 1 వికెట్ తీశారు.

మ్యాచ్‌లో చాలా సేపు ఉరుములు, మెరుపులు రావ‌డంతో ప్లేయ‌ర్ల భ‌ద్ర‌త దృష్ట్యా చాలా సేపు మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వ‌చ్చింది. దీంతో మ్యాచ్‌కు ఆటంకం ఏర్ప‌డి ఓవ‌ర్ల‌ను కుదించారు. ఈ క్ర‌మంలో డ‌క్ వ‌ర్త్ లూయీస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం భార‌త్ టార్గెట్‌ను 37 ఓవ‌ర్ల‌లో 96 ప‌రుగుల‌కు కుదించారు. ఈ క్ర‌మంలో కాసేప‌టికి బ్యాటింగ్ చేసిన భార‌త్ 17.2 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 99 ప‌రుగులు చేసింది. అయితే టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ అన‌వ‌స‌ర షాట్స్ ఆడి వికెట్ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. కానీ మిడిలార్డ‌ర్ ప్లేయ‌ర్లు క్రీజులో కుదురుగా నిల‌బ‌డి ప‌రుగుల‌ను రాబ‌ట్టారు. దీంతో మొద‌ట్లో వికెట్లు ప‌డినా చివ‌ర‌కు భార‌త్ సులభంగానే గెలుపొందింది. భార‌త ప్లేయ‌ర్ల‌లో అభిజ్ఞాన్ కుందు (41 బంతుల్లో 42, 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) అజేయంగా నిలిచాడు. ఇక యూఎస్ఏ బౌల‌ర్ల‌లో రిత్విక్ అప్పిడి 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, రిష‌బ్ షింపి, ఉత్క‌ర్ష్ శ్రీ‌వాత్స‌వ చెరొక వికెట్ తీశారు. ఈ టోర్నీలో భార‌త్ త‌న త‌దుపరి మ్యాచ్‌ను ఈ నెల 17వ తేదీన బంగ్లాదేశ్ జ‌ట్టుతో ఆడ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement