T20 World Cup 2026 | ఆసీస్‌పై శ్రీలంక ఘన విజయం వెనుక.. భారత మాజీ కోచ్‌లు..
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియాపై శ్రీలంక సాధించిన సంచలన విజయంలో భారత మాజీ కోచ్‌ల పాత్రను శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య ప్రశంసించారు. గత రెండు టోర్నమెంట్‌లలో గ్రూప్ దశను దాటలేకపోయిన శ్రీలంక ఈసారి 2021 చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి సూపర్-8కు అర్హత సాధించింది.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియాపై శ్రీలంక సాధించిన సంచలన విజయంలో భారత మాజీ కోచ్‌ల పాత్రను శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య ప్రశంసించారు. గత రెండు టోర్నమెంట్‌లలో గ్రూప్ దశను దాటలేకపోయిన శ్రీలంక ఈసారి 2021 చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి సూపర్-8కు అర్హత సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం పతుమ్ నిస్సంక అద్భుత ప్రదర్శన అనే చెప్పవచ్చు. సోమవారం (ఫిబ్రవరి 16, 2026) జరిగిన మ్యాచ్‌లో నిస్సంక టోర్నమెంట్‌లో తొలి శతకం సాధించడమే కాకుండా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్విచ్ హిట్‌కు పాయింట్‌లో డైవ్ చేస్తూ పట్టిన అద్భుత క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌ను చాలామంది క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ గా అభివర్ణిస్తున్నారు.
శ్రీధర్, విక్రమ్ రాథోడ్ కృషి కీలకం: జయసూర్య
మ్యాచ్ అనంతరం మాట్లాడిన జయసూర్య.. జట్టు విజయంలో భారత మాజీ కోచ్‌లు ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్) కృషి ఎంతో కీలకమని తెలిపారు. శ్రీధర్ ఫీల్డింగ్‌పై అద్భుతంగా పనిచేస్తున్నారు. విక్రమ్ బ్యాటింగ్ యూనిట్‌కు ఆత్మవిశ్వాసం ఇచ్చారు. ఐపీఎల్ అనుభవం కారణంగా లంక ఆటగాళ్లతో మంచి అనుబంధం ఏర్పరుచుకున్నారు. కోచ్‌లుగా మేం ఎప్పుడూ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాం. ఈ విజయంలో వారి పాత్ర చాలా కీలకం.. అని జయసూర్య పేర్కొన్నారు. బౌలింగ్ ప్రదర్శనను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. తొలి 8 ఓవర్లలో 100 పరుగులు ఇచ్చిన తర్వాత, శ్రీలంక స్పిన్నర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు. కీలక ఫాస్ట్ బౌలర్ మతీష పతిరన తొడ కండరాల గాయంతో బయటకు వెళ్లినా, జట్టు వెనకడుగు వేయలేదని జయసూర్య అన్నారు.
లంక జట్టులో వచ్చిన మార్పుపై ఫ్యాన్స్ ఆశ్చర్యం..
పేస్ మార్చుతూ, వికెట్ సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని డ్రెస్సింగ్ రూంలో నిర్ణయించాం. మహీష్ తీక్షణ సహా అందరూ చక్కగా బౌలింగ్ చేశారు. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అని జయసూర్య చెప్పారు. నిస్సంక శతకం, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంక ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించింది. అయితే వనిందు హసరంగ, పతిరన గాయాలతో దూరమైనప్పటికీ, వచ్చే రౌండ్‌లోనూ అదే ఉత్సాహంతో కొనసాగాలని శ్రీలంక జట్టు ఆశిస్తోంది. అయితే ఆస్ట్రేలియాపై శ్రీలంక బ్యాట్స్‌మన్ ఆడిన తీరును చూశాక చాలా మందికి సందేహం కలిగింది. అసలు శ్రీలంక ఇంతలా ఎలా మార్పు చెందింది.. వారు ఆసీస్‌ను ఇంత దీటుగా ఎలా ఎదుర్కొన్నారు.. అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ జయసూర్య వ్యాఖ్యలతో లంక ప్లేయర్ల విజయం వెనుక భారత జట్టు మాజీ కోచ్‌లు ఉన్నారని స్పష్టమైంది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే శ్రీలంక ఇదే ఉత్సాహాన్ని సూపర్-8లో కొనసాగిస్తుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






