IPL Betting | ఐపీఎల్ బెట్టింగ్‌ల కోసం సొంత ఇంట్లోనే దొంగతనం
IPL Betting | ఐపీఎల్ (IPL).. క్రికెట్ అభిమానులను ఒక ఊపుఊపేస్తున్నది. 250కిపైగా లక్ష్యాలను సైతం బ్యాట్స్‌మెన్ సులభంగా చితకొట్టేస్తున్నారు. దీనికి కొంత నాటకీయత తోడవుతుండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనని ప్రేక్షక్షుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సరిగ్గా దీన్నే బెట్టింగ్ నిర్వాహకులు (IPL Betting) క్యాష్ చేసుకుంటున్నారు.
IPL Betting | త్రినేత్ర.న్యూస్: ఐపీఎల్ (IPL).. క్రికెట్ అభిమానులను ఒక ఊపుఊపేస్తున్నది. 250కిపైగా లక్ష్యాలను సైతం బ్యాట్స్‌మెన్ సులభంగా చితకొట్టేస్తున్నారు. దీనికి కొంత నాటకీయత తోడవుతుండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనని ప్రేక్షక్షుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సరిగ్గా దీన్నే బెట్టింగ్ నిర్వాహకులు (IPL Betting) క్యాష్ చేసుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా యువత నుంచి వృద్ధుల వరకు బెట్టింగ్‌లు కాస్తున్నారు. దీనికోసం అప్పులు చేయడమే కాదు.. సింత ఇంట్లోనే దొంగలుగా మారుతున్నారు. ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ తిరుమలగిరిలో చోటుచేసుకున్నది.
ఏపీకి చెందిన సివిల్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు తన కుటుంబంతో కలిసి తిరుమలగిరిలోని దుర్గా విహార్ కాలనీ నివాసం ఉంటున్నారు. మార్చి 5న తన భార్యతో కలిసి ఏపీలోని స్వగ్రానికి వెళ్లారు. అదే బిల్డింగ్ పెంట్ హౌస్‌లో వారి కుమారుడు రాజు ఉంటున్నారు. ఈ క్రమంలో బెడ్ రూమ్ కిటికీ గ్రిల్స్ తొలగించి 15 తులాల బంగారం, రూ. 1.50 లక్షల నగదును కాజేశాడు. తన నేరం బయటపడకుండా ఉండేందుకు ఏప్రిల్ 27న తానే స్వయంగా తండ్రికి ఫోన్ చేసి కిటికీలు తెరిచి ఉన్నాయని చెప్పాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే రాజు ‘డాఫా’ క్రికెట్ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకుని ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. దొంగిలించిన బంగారంలో 12 తులాలను ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 12.5 లక్షల తీసుకున్నాడని, ఆ డబ్బును కూడా మళ్లీ బెట్టింగ్‌లోనే పోగొట్టినట్లు తేలింది. అతని వద్ద 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో కార్ఖానా, తిరుమలగిరి స్టేషన్లలో కేసులు ఉన్నాయి. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






