T20 World Cup 2026 | అంపైర్ తప్పుడు నిర్ణయం.. మండిపడుతున్న శ్రీలంక ఫ్యాన్స్..
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా శనివారం పల్లెకెలెలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ అద్భుతమైన థ్రిల్లర్‌గా మారింది. చివరి ఓవర్‌లో శ్రీలంక గెలిచేందుకు 28 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ బౌలర్ షహీన్ షా అఫ్రిది చివరి ఓవర్‌లో బౌలింగ్ వేశాడు.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా శనివారం పల్లెకెలెలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ అద్భుతమైన థ్రిల్లర్‌గా మారింది. చివరి ఓవర్‌లో శ్రీలంక గెలిచేందుకు 28 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ బౌలర్ షహీన్ షా అఫ్రిది చివరి ఓవర్‌లో బౌలింగ్ వేశాడు. అయితే ఒక్క ఓవర్‌లో అన్ని పరుగులను సాధించడం కష్టం కనుక శ్రీలంక ఓటమి ఖాయమైందని అందరూ అనుకున్నారు. కానీ శ్రీలంక కెప్టెన్ దసున్ శనక సిక్సర్లు బాదాడు. తమ జట్టును విజయం దగ్గరి వరకు తీసుకెళ్లాడు. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మొదటి బంతికి ఫోర్ కొట్టిన శనక తరువాత వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సులు బాదాడు. 5వ బంతిని అఫ్రిది స్టంప్స్‌కు దూరంగా వేశాడు. తరువాత చివరి బంతిని కూడా అదేవిధంగా వేశాడు. అయితే ఆ బంతి వాస్తవానికి బ్లూ లైన్‌కు అవతల పడినట్లు రీప్లేలో స్పష్టంగా తేలింది. కానీ అంపైర్ మాత్రం దాన్ని వైడ్‌గా ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ ముగిసింది. శ్రీలంక 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అంపైర్‌పై నెటిజన్ల విమర్శలు..
అయితే శనక దాన్ని వైడ్ అని భావించి వదిలేశాడు. కానీ అంపైర్ ఇవ్వకపోవడంతో అది డాట్ బాల్ అయింది. ఈ క్రమంలో శ్రీలంక ఓడిపోవాల్సి వచ్చింది. కానీ తరువాత రీప్లేలో అది వైడ్ బాల్ అని. తేలింది. అయితే అంపైర్ దాన్ని వైడ్ ఇవ్వకపోవడంతో శ్రీలంక ఫ్యాన్స్ అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. దాన్ని వైడ్‌గా ఇచ్చి ఉంటే అప్పుడు శ్రీలంకకు ఒక్క బంతిలో 5 పరుగులు చేయాల్సి వచ్చేదని, ఆ బంతికి కనీసం 4 కొట్టినా మ్యాచ్ టై అయి ఉండేదని శ్రీలంక ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు అంపైర్‌పై మండిపడుతున్నారు. అది వైడ్ బంతిని అని, అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా శ్రీలంక అద్భుతమైన మ్యాచ్‌ను ఓడిపోవాల్సి వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.
శ్రీలంక ఫ్యాన్స్‌కు సారీ: శనక
మ్యాచ్ ముగిసిన అనంతరం దసున్ శనక మాట్లాడుతూ తాను జట్టును గెలిపించగలిగేవాడినని చెప్పాడు. అంత దగ్గరగా వచ్చిన మ్యాచ్‌లో తాను దాన్ని ముగించగలిగేవాడినని, కానీ అదృష్టం కలసి రాలేదని, షహీన్‌కు అభినందనలు అని పేర్కొన్నాడు. అయితే సెమీ ఫైనల్ పరంగా చూస్తే శ్రీలంకకు ఈ మ్యాచ్‌లో గెలిచినా ఉపయోగం లేదు. కానీ చివరి వరకు వచ్చిన మ్యాచ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా పోయిందని శ్రీలంక ఫ్యాన్స్ అంటున్నారు. తమకు ఇది చాలా కఠినమైన సమయమని, జట్టు ప్లేయర్లకు గాయాలు అయ్యాయని, అందువల్లే తాము విఫలం అయ్యాయని శనక అన్నాడు. శ్రీలంక ఆశించిన రీతిలో రాణించనందుకు ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు. జట్టులో ఇద్దరు కీలకబౌలర్లు లేకపోవడం పెద్ద నష్టంగా మారిందని, వరల్డ్ కప్ సమయంలో కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టు విజయాలపై ప్రభావం చూపించిందని అన్నాడు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

Dope Tests | చిక్కుల్లో యశస్వీ జైస్వాల్, షెఫాలీ వర్మ.. నోటీసులు జారీ చేసిన నాడా..!
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



