T20 World Cup 2026 | పాక్ ప్రధానికి శ్రీలంక అధ్యక్షుడు థాంక్స్.. ఫోన్‌లో మాట్లాడిన దిసనాయకె..
T20 World Cup 2026 | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణను ఉపసంహరించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఆదేశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
T20 World Cup 2026 | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణను ఉపసంహరించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఆదేశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని ఐసీసీ, పీసీబీలు వేర్వేరు ప్రకటనలు చేశాయి. బంగ్లాదేశ్, శ్రీలంకల విజ్ఞప్తుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో టోర్నమెంట్‌పై నెలకొన్న అనిశ్చితి ముగిసింది.
షెహబాజ్‌తో ఫోన్‌లో మాట్లాడిన దిసనాయకె..
కొలంబోలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుండటం ఆనందంగా ఉంది.. అని దిసనాయకె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు PCBకు లేఖ రాసిన అనంతరం, సోమవారం రాత్రి దిసనాయకె స్వయంగా షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడి మ్యాచ్ ఆడేలా ఒప్పించారు. ఈ సంభాషణను పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం కూడా అధికారికంగా ధ్రువీకరించింది. అయితే శ్రీలంకతోపాటు పాక్ మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌లకు చెందిన ఐసీసీ సభ్యులు కూడా పాక్ క్రికెట్ బోర్డుతో సోమవారం చర్చలు జరిపారు. ఈ మ్యాచ్ జరగకపోతే అన్ని దేశాలకు తీవ్రంగా నష్టం కలుగుతుందని, ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు పాక్ బోర్డుకు చెప్పారు. దీంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మళ్లీ హోటల్ బుకింగ్స్ షురూ..
కాగా భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందో లేదోనని శ్రీలంక ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మ్యాచ్‌కు మరి కొద్ది రోజులే సమయం ఉన్నా హోటల్ బుకింగ్స్ జరగడం లేదని, ఇప్పటికే ఉన్న బుకింగ్స్‌ను కూడా రద్దు చేసుకున్నారని, ఈ మ్యాచ్ జరగకపోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సీ) అంతకు ముందు పీసీబీకి లేఖ రాసింది. అయితే బంగ్లాదేశ్ కు న్యాయం చేస్తామని ఐసీసీ నుంచి స్పష్టమైన హామీ లభించడంతోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ మ్యాచ్ జరుగుతుందని నిర్దారణ కావడంతో ఇక శ్రీలంకలో మళ్లీ హోటల్ రూమ్ బుకింగ్స్ ఊపందుకోనున్నాయి. ఈ మ్యాచ్ వల్ల శ్రీలంకకు కూడా భారీ ఎత్తున ఆదాయం రానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

Dope Tests | చిక్కుల్లో యశస్వీ జైస్వాల్, షెఫాలీ వర్మ.. నోటీసులు జారీ చేసిన నాడా..!
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



