T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌లో ఆడతాం, భారత్ తో మ్యాచ్ మాత్రం బహిష్కరణే.. వెల్లడించిన పాక్..
T20 World Cup 2026 | త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. టోర్నీలో పాల్గొంటామని చెబుతూనే, భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు మాత్రం దూరంగా ఉంటామని వెల్లడించడం సంచలనంగా మారింది.
T20 World Cup 2026 | త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. టోర్నీలో పాల్గొంటామని చెబుతూనే, భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు మాత్రం దూరంగా ఉంటామని వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ ప్రకటనపై స్పందించిన ఐసీసీ పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపినా, ఇప్పటివరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ అందలేదని స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో తమ జాతీయ జట్టు, ఎంపిక చేసిన మ్యాచ్‌లలో మాత్రమే పాల్గొనాలని పాకిస్థాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనను తాము గమనించామని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, టోర్నీ షెడ్యూల్ ప్రకారం అర్హత సాధించిన అన్ని జట్లు సమాన నిబంధనలపై పోటీ పడాలన్న అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ మౌలిక సూత్రాలకు ఈ సెలెక్టివ్ పార్టిసిపేషన్ విధానం సరిపోదని ఐసీసీ వర్గాలు సూచించాయి.
స్పష్టంగా ప్రకటన..
టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి వారం కూడా లేని సమయంలో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్‌సిన్ నక్వీ.. ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కలిసి ఈ అంశంపై చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ భవితవ్యంపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనడానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. అయితే, ఫిబ్రవరి 15, 2026న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మైదానంలోకి దిగదు.. అని స్పష్టంగా పేర్కొన్నారు.
ఒప్పందం కుదిరినా..
భారత్ మ్యాచ్‌ను బహిష్కరించినప్పటికీ, పాకిస్థాన్ మాత్రం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొననుంది. భారత్ మాదిరిగానే పాకిస్థాన్ కూడా నెదర్లాండ్స్, యూఎస్ఏ, నమీబియా జట్లతో గ్రూప్ దశలో తలపడనుంది. బీసీసీఐ, పీసీబీ, ఐసీసీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ జట్టు అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరగనున్నాయి. అయితే ఈ వ్యవహారం క్రికెట్ క్రీడకే కాకుండా, క్రీడా-రాజకీయాల మేళవింపుపై మరోసారి పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



