త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | పాక్ ఓట‌మిని జీర్ణించుకోలేని ఫ్యాన్ టీవీని ప‌గ‌ల‌గొట్టాడు.. వీడియో..

T20 World Cup 2026 | శ్రీ‌లంక‌లోని కొలంబో వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 గ్రూప్ ఎ మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ త‌ల‌ప‌డ‌గా.. భార‌త్ సునాయాసంగా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. పాక్ బ్యాట‌ర్లు క‌నీసం భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన‌లేక‌పోయారు.

S

Sports | Published On Feb 16, 2026, 9.48 am IST

T20 World Cup 2026 | పాక్ ఓట‌మిని జీర్ణించుకోలేని ఫ్యాన్ టీవీని ప‌గ‌ల‌గొట్టాడు.. వీడియో..
Advertisement

T20 World Cup 2026 | శ్రీ‌లంక‌లోని కొలంబో వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 గ్రూప్ ఎ మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ త‌ల‌ప‌డ‌గా.. భార‌త్ సునాయాసంగా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. పాక్ బ్యాట‌ర్లు క‌నీసం భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన‌లేక‌పోయారు. క‌నీసం భార‌త జ‌ట్టు స్కోరు ద‌రిదాపుల్లోకి కూడా రాలేదు. ఘోర ఓట‌మి పాల‌య్యారు. 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత్ కేవలం 114 పరుగులకే కట్టడి చేసింది. భారత జట్టుకు ఇది మ‌రో సాధారణ విజయంలా అనిపించినా, పాకిస్థాన్‌కు మాత్రం మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే మ్యాచ్‌కు సంబంధించిన రియాక్ష‌న్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న క్రమంలో ఓ పాకిస్థాన్ అభిమాని ఓటమిని తట్టుకోలేక తన టీవీని పగలగొడుతున్న వీడియో వైరల్‌గా మారింది.

భార‌త్ రికార్డు 8-1..

భారత్ చేతిలో ఎదురైన పరాజయం పాక్‌ అభిమానుల్లో ఎంత ఆవేదనను మిగిల్చిందో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అర్ధశతకం పాకిస్థాన్‌పై నాకౌట్ పంచ్‌లా పనిచేసింది. దానికి తోడు భారత బౌలర్లు సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్‌కు 61 పరుగుల భారీ విజయం దక్కింది. ఈ గెలుపుతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లలో భారత్-పాకిస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డు 8-1కి చేరింది. ప్రత్యర్థిపై భారత్ ఆధిపత్యం మరింత బలపడింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ను ఇక ప్రత్యర్థులుగా చూడడం లేదని, కేవలం మరో జట్టుగానే భావిస్తున్నామని స్పష్టం చేశాడు. మేం ఎలాంటి వైరం గురించి ఆలోచించడం లేదు. ఒక మ్యాచ్‌గా మాత్రమే చూస్తాం. క్రికెట్‌పైనే దృష్టి పెడతాం. ఎవరు ఎదురున్నా, అదే మా ఆలోచన.. అని అక్షర్ చెప్పాడు.

జీర్ణించుకోలేక‌పోతున్న‌ పాక్ ఫ్యాన్స్‌..

పరుగుల ఛేదనలో పాకిస్థాన్ ఆరంభంలోనే కుదేలైంది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌ల దెబ్బకు పవర్‌ప్లేలోనే 34 పరుగులకే పాక్ 4 వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖాన్ (34 బంతుల్లో 44 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే కొంత ప్రతిఘటన చూపించినా, అది సరిపోలేదు. చివరికి పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (4 ఓవర్లలో 2/29) అత్యుత్తమంగా రాణించాడు. హార్దిక్ పాండ్యా (3 ఓవర్లలో 2/16), జస్ప్రీత్ బుమ్రా (2 ఓవర్లలో 2/17), వరుణ్ చక్రవర్తి (3 ఓవర్లలో 2/17) కూడా కీలక వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ పతనాన్ని వేగవంతం చేశారు. అయితే ఈ ఓటమిని పాక్ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. సాధార‌ణంగా ఎప్పుడు త‌ల‌ప‌డినా స‌రే పాక్ కాస్త పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించేది. కానీ ఈసారి పూర్తిగా భార‌త్‌కు దాసోహం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. దీన్ని పాక్ అభిమానులు స‌హించ‌లేక‌పోతున్నారు. అందుక‌నే అభిమానులు ఎప్ప‌టిలాగే టీవీల‌ను ప‌గ‌ల‌గొడుతున్నారు.

Advertisement
Advertisement