త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌.. ఐసీసీ నుంచి ఎవ‌రికెంత ఆదాయం వ‌స్తోంది..?

T20 World Cup 2026 | ప్రపంచ క్రికెట్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉన్న వాణిజ్య విలువకు సాటి మరొకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు ఆసియా ప్రత్యర్థుల మధ్య జరిగే ప్రతి పోరు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)కి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ఈవెంట్‌గా నిలుస్తోంది.

S

Sports | Published On Feb 15, 2026, 7.25 am IST

T20 World Cup 2026 | ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌.. ఐసీసీ నుంచి ఎవ‌రికెంత ఆదాయం వ‌స్తోంది..?
Advertisement

T20 World Cup 2026 | ప్రపంచ క్రికెట్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉన్న వాణిజ్య విలువకు సాటి మరొకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు ఆసియా ప్రత్యర్థుల మధ్య జరిగే ప్రతి పోరు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)కి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ఈవెంట్‌గా నిలుస్తోంది. ఒక్క మ్యాచ్‌కు సంబంధించిన వాణిజ్య విలువ సుమారు రూ.1,800 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల వరకు (అంటే 200-250 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. ఈ మ్యాచ్‌ల ద్వారా ఎక్కువ లాభం పొందేది సహజంగానే బీసీసీఐ కావ‌డం విశేషం. ప్రపంచ క్రికెట్ ఆదాయంలో భారత్‌ వాటా 70 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో, ఐసీసీ వార్షిక ఆదాయంలో కూడా బీసీసీఐకి అత్యధిక వాటా దక్కుతోంది. అందుకే ఐసీసీ రెవెన్యూ షేరింగ్‌లో బీసీసీఐ ఎప్పటికీ ముందంజలో ఉంటుంది.

బీసీసీఐకి ఏకంగా 40 శాతం వాటా..

ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ నాలుగేళ్ల సైకిల్‌లో (2024-2027) బీసీసీఐకి గ్లోబల్ బాడీ ఆదాయంలో దాదాపు 40 శాతం వాటా లభించనుంది. గణాంకాల ప్రకారం, ఐసీసీ 2024-27 రెవెన్యూలో బీసీసీఐ వాటా 38.50 శాతంగా ఉంది. ఇది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు కలిపి వచ్చే వాటాకన్నా ఎక్కువ కావడం విశేషం. ఈ శాతాన్ని నగదు పరంగా లెక్కిస్తే, ఐసీసీ నుంచి బీసీసీఐకి సుమారుగా రూ.2,079 కోట్ల వరకు ఆదాయం లభించనుంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఐసీసీ రెవెన్యూలో కేవలం 5.75 శాతం మాత్రమే వాటా ఉంది. దాని ద్వారా పీసీబీకి దక్కే మొత్తం సుమారు రూ.310 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

మైదానంలో మాత్రం భార‌త్ దే ఆధిక్యం..

అయితే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు ఉన్న విపరీతమైన ఆదరణ, ఆసక్తి, వాణిజ్య విలువ కారణంగా ఈ పోరులో పాల్గొనే ఇరు జట్లకూ ఆర్థికంగా లాభమే కలుగుతోంది. టికెట్ విక్రయాలు, ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే ఆదాయం ఈ మ్యాచ్‌లను మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. ఇక మైదానంలో రికార్డుల విషయానికి వస్తే, ఇటీవలి కాలంలో భారత్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తోంది. మూడు సంవత్సరాలుగా పాకిస్థాన్‌ భారత్‌పై టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల‌లో విజయం సాధించలేదు. వాణిజ్య పరంగా ఎంత పెద్ద పోరైనా, మైదానంలో మాత్రం భారత్‌ ఆధిపత్యం స్ప‌ష్టంగా కొన‌సాగుతోంది. అయితే పాకిస్థాన్‌తో ఐసీసీ టోర్నీల్లో భార‌త్ మ్యాచ్‌ల‌ను ఆడ‌క‌పోయినా బీసీసీఐకి పెద్ద‌గా వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌దు. ఇత‌ర జట్ల‌తో జ‌రిగే మ్యాచ్‌ల‌తోపాటు ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం వ‌స్తోంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇదే కంట‌గింపుగా మారింది. అందుక‌నే ప్ర‌తి విష‌యంలోనూ ఏదైనా చిన్న అవ‌కాశం ల‌భిస్తే బీసీసీఐని ఇరికించాల‌ని, అభాసుపాలు చేయాల‌ని పీసీబీ చూస్తుంటుంది. కానీ ఈసారి కూడా బాయ్ కాట్ డ్రామాలో పాక్ ప‌ప్పులు ఏమీ ఉడ‌క‌లేదు. మొత్తం వ్య‌వ‌హారంలో పాక్‌కు అస‌లు ఒరిగిందేమీ లేదు. ఈ ప‌రిమాణాల నేప‌థ్యంలో ఆదివారం రాత్రి జ‌ర‌గ‌నున్న భార‌త్‌-పాక్ మ్యాచ్ అత్యంత ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని క్రికెట్ పండితులు సైతం అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement