T20 World Cup 2026 | సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఫ్యాన్స్‌లో అయోమయం.. టిక్కెట్లను కొనాలా, వద్దా..?
T20 World Cup 2026 | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ్యవహారం ఫ్యాన్స్‌ను గందరగోళంలో పడేసింది. టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్, ఫైనల్ వేదికలపై స్పష్టత రాకముందే స్టేడియంలలో టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెమీఫైనల్, ఫైనల్ మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరగాల్సి ఉంది.
T20 World Cup 2026 | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ్యవహారం ఫ్యాన్స్‌ను గందరగోళంలో పడేసింది. టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్, ఫైనల్ వేదికలపై స్పష్టత రాకముందే స్టేడియంలలో టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెమీఫైనల్, ఫైనల్ మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరగాల్సి ఉంది. కానీ సెమీ ఫైనల్‌కు శ్రీలంక, పాకిస్థాన్ చేరితే వారి మ్యాచ్‌లను కొలంబోలోనే నిర్వహిస్తామని ఐసీసీ చెప్పింది. దీంతో భారత్‌లో సెమీ ఫైనల్స్ (ముంబై, కోల్‌కతా) జరుగుతాయని ఆశించి టిక్కెట్లను కొనుగోలు చేస్తే పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. అయితే ఈ అన్ని విషయాలపై ఐసీసీ స్పష్టతను ఇచ్చింది.
వేదికలు మారితే రీఫండ్..
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ సెమీ ఫైనల్, ఫైనల్‌కు చేరితే వారి మ్యాచ్‌లను శ్రీలంకలోనే నిర్వహిస్తారు. అందులో ఎలాంటి మార్పు లేదు. ఇక శ్రీలంక సెమీ ఫైనల్‌కు చేరి భారత్ కాకుండా ఇతర జట్లతో తలపడితే వారి మ్యాచ్ కూడా సొంత దేశంలోనే ఉంటుంది. అయితే శ్రీలంక సెమీస్ చేరి ఒక వేళ భారత్‌తో తలపడాల్సి వస్తే మాత్రం ఆ మ్యాచ్‌ను కోల్‌కతాలో నిర్వహిస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్ మాత్రం అహ్మదాబాద్‌లో ఉంటుంది. పాక్ ఫైనల్‌కు చేరితే ఈ మ్యాచ్‌ను కూడా కొలంబోకు మారుస్తారు. ఇలా ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్ వేదికలుగా ప్రస్తుతానికి టిక్కెట్లను విక్రయిస్తున్నారు. కానీ ఈ వేదికల్లో మార్పులు ఉంటే మాత్రం టిక్కెట్ డబ్బులను రీఫండ్ చేస్తామని ఐసీసీ ప్రకటించింది.
ఇతర ఖర్చులు నష్టమే..
ఐసీసీ చెప్పిన ప్రకారం ఒక వేళ టిక్కెట్ డబ్బులను రీఫండ్ పొందినా కూడా ఆ వేదిక కోసం ప్రేక్షకులకు అయ్యే రవాణా, హోటల్ వసతి, ఇతర ఖర్చులు వృథా కానున్నాయి. అంటే టిక్కెట్లను ఇప్పుడు కొనుగోలు చేసినా ఒక వేళ వేదిక మారితే ప్రేక్షకులకు కేవలం టిక్కెట్ డబ్బులు మాత్రమే వెనక్కి వస్తాయన్నమాట. ఇతర ఖర్చులు నష్టపోవాల్సి ఉంటుంది. దీనిపైనే ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా వేదికలను నిర్ణయించి టిక్కెట్లను విక్రయించాలని కోరుతున్నారు.
కొలంబో ఫ్లోటింగ్ వెన్యూ..
శ్రీలంకలోని కొలంబోను ఐసీసీ ఫ్లోటింగ్ వెన్యూగా అరేంజ్ చేసింది. అంటే పాక్, శ్రీలంక జట్లు సెమీస్‌కు చేరే పొజిషన్లను బట్టి ఈ వేదికను ఖరారు చేస్తారు. పాక్ సెమీస్‌కు చేరితే సెమీఫైనల్ 1లో కొలంబోలో మార్చి 4న మ్యాచ్ ఆడుతుంది. ఒక వేళ శ్రీలంక సెమీ ఫైనల్ కు చేరితే, భారత్ కాకుండా ఇతర జట్లతో ఆడాల్సి వస్తే సెమీ ఫైనల్ 1లో వారు అదే రోజు కొలంబోలో మ్యాచ్ ఆడుతారు. ఇక సెమీ ఫైనల్‌లో శ్రీలంక, భారత్ ఆడాల్సి వస్తే ఆ మ్యాచ్ మాత్రం కోల్‌కతాలో అదే రోజు జరుగుతుంది. అలాగే సెమీ ఫైనల్ 2ను యథాప్రకారం ముంబైలోని వాంఖెడె స్టేడియంలో నిర్వహిస్తారు.
సంబంధిత వార్తలు

Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
మే 20, 2026

Gold Ring Falls Into Train Toilet | ప్రయాణికుడి చేతి నుంచి ట్రైన్ టాయిలెట్లోకి జారిపోయిన గోల్డ్ రింగ్.. తర్వాత ఏమైందంటే..?
మే 16, 2026

Dope Tests | చిక్కుల్లో యశస్వీ జైస్వాల్, షెఫాలీ వర్మ.. నోటీసులు జారీ చేసిన నాడా..!
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



