T20 World Cup 2026 | టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ దూరం..?
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీని భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ డకౌట్‌తో ప్రారంభించాడు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో అతను పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో అభిమానులు పూర్తిగా నిరాశ వ్యక్తం చేశారు.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీని భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ డకౌట్‌తో ప్రారంభించాడు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో అతను పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో అభిమానులు పూర్తిగా నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఫిబ్రవరి 12వ తేదీన నమీబియాతో ఢిల్లీలో జరగనున్న మ్యాచ్‌లో అభిషేక్ రాణిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ వారి కోరిక ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే అభిషేక్ జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతూ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కనుక అతను నమీబియాతో మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.
అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందే..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవానికి అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే అభిషేక్ శర్మ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కానీ మ్యాచ్‌లో మాత్రం పాల్గొన్నాడు. అయితే మ్యాచ్ తరువాత అతనికి సమస్య మరింత ఎక్కువైంది. ఇన్‌ఫెక్షన్‌తోపాటు జ్వరం కూడా వచ్చింది. దీంతో అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్సను కూడా అందించారు. ఇక మ్యాచ్ లో అభిషేక్ ఔట్ అయ్యాక తిరిగి డగౌట్‌కు కూడా రాలేదు. అలాగే భారత బౌలింగ్ సమయంలో ఫీల్డింగ్ చేయలేకపోయాడు. మరోవైపు జస్‌ప్రిత్ బుమ్రా కూడా ఆడకపోవడంతో ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, కుల్దీప్ యాదవ్ లు ప్లేయర్లకు డ్రింక్స్ అందించారు. ఇక మ్యాచ్ తరువాత కూడా అభిషేక్ హ్యాండ్ షేక్‌కు రాలేదు. దీంతో సమస్య అధికంగానే ఉన్నట్లు స్పష్టమైంది. ఈ క్రమంలో అతను ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండగా, అతను నమీబియాతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. అయితే అతను ఆ మ్యాచ్‌కు దూరం అయితే గనక అతని స్థానంలో సంజు శాంసన్‌కు చాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోలుకున్న బుమ్రా..
ఇక ఇదే విషయంపై జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొస్కాట్ మీడియాతో మాట్లాడుతూ అభిషేక్‌కు ప్రస్తుతం జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్ ఉందని తెలిపారు. అతను కోలుకునేందుకు 2-3 రోజులు పట్టవచ్చని, కనుక నమీబియాతో మ్యాచ్‌ను అతను ఆడుతాడా, లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. కాగా జ్వరం, దగ్గు సమస్యలతో యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌కు బుమ్రా దూరం కాగా అతను ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. అయితే బుమ్రా జట్టులోకి వస్తే అతని స్థానంలో ఇప్పటికే జట్టులో ఉన్న మహమ్మద్ సిరాజ్‌ను తొలగిస్తారా, జట్టు కూర్పు ఎలా ఉంటుదన్నది ప్రస్తుతం ఆసక్తికకరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



