త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | వివాదాలు.. బ‌హిష్క‌ర‌ణ‌ల న‌డుమ‌.. మ‌రికాసేప‌ట్లో టీ20 వరల్డ్ కప్ షురూ..

T20 World Cup | వివాదాలు.. బ‌హిష్క‌ర‌ణల న‌డుమ ప్ర‌తిష్ఠాత్మ‌క టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ (T20 World Cup) మ‌రో రెండు గంట‌ల్లో ప్రారంభం కానుంది. భార‌త్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగాటోర్నీ నెద‌ర్లాండ్స్‌, పాకిస్థాన్ (Pakistan) మ‌ధ్య (కొలంబోలో) జ‌రుగ‌నున్న మ్యాచ్‌తో ఆరంభమ‌వుతుంది (Curtain Raiser).

G

Sports | Published On Feb 7, 2026, 9.40 am IST

T20 World Cup | వివాదాలు.. బ‌హిష్క‌ర‌ణ‌ల న‌డుమ‌.. మ‌రికాసేప‌ట్లో టీ20 వరల్డ్ కప్ షురూ..
Advertisement

T20 World Cup | త్రినేత్ర‌.న్యూస్‌: వివాదాలు.. బ‌హిష్క‌ర‌ణల న‌డుమ ప్ర‌తిష్ఠాత్మ‌క టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ (T20 World Cup) మ‌రో రెండు గంట‌ల్లో ప్రారంభం కానుంది. భార‌త్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగాటోర్నీ నెద‌ర్లాండ్స్‌, పాకిస్థాన్ (Pakistan) మ‌ధ్య (కొలంబోలో) జ‌రుగ‌నున్న మ్యాచ్‌తో ఆరంభమ‌వుతుంది (Curtain Raiser). దీంతోపాటు మ‌రో రెండు మ్యాచులు కూడా శ‌నివారం జ‌రుగ‌నున్నాయి. ముంబైలో అమెరికాతో భార‌త్‌, కోల్‌కతాలో స్కాట్లాండ్‌తో వెస్టిండీస్ త‌ల‌ప‌డ‌నున్నాయి. భార‌త్‌, అమెరికా మ్యాచ్‌కు ముందు ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఆరంభ వేడుక‌ల‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించారు.

ఐసీసీ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కోసం మొత్తం 20 జట్లు పోటీపడుతున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభ‌జించారు. ఒక్కోగ్రూప్‌లో ఐదు జ‌ట్లు ఉంటాయి. ప్ర‌తీ జ‌ట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూపులో టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఇందులో నుంచి టాప్‌-4 సెమీఫైనల్లో నిలుస్తాయి. మార్చి 8న ఫైనల్‌ పోరు జరుగనుంది. భార‌త్‌లో (India) ఆడ‌టానికి పాకిస్థాన్ నిరాక‌రించ‌డంతో ఆ జ‌ట్టు ఆడే మ్యాచ్‌ల‌న్నింటిని శ్రీలంక‌లో (Srilanka) నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పాక్ ఫైన‌ల్ చేరిన‌ట్ల‌యితే భారత్‌లో కాకుండా శ్రీలంకలో మ్యాచ్‌ జరుగనుంది. కాగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లో మెగాటోర్నీ మ్యాచ్‌లు జరుగనుండగా, శ్రీలంకలో కొలంబో, పల్లెకిలె ఆతిథ్యమిస్తున్నాయి.

భారత్ vs అమెరికా

టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టైన భార‌త్ గ్రూప్‌-ఏలో ఉన్న‌ది. త‌న తొలి మ్యాచ్‌లో పసికూన అమెరికాతో తలపడనుంది. సొంతగడ్డపై తిరుగులేని టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను మ‌రోసారి సొంతం చేసుకోవాల‌ని భావిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో గ్రూపు దశలో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌తో ఆడనున్న భారత్‌.. సుల‌భంగానే సూపర్‌-8 చేర‌నుంది.

Advertisement
Advertisement