Sunrisers | సన్ రైజర్స్ యాజమాన్యానికి షాక్.. పాక్ ప్లేయర్‌ను కొన్న అనంతరం ఎక్స్ ఖాతా సస్పెన్షన్..
Sunrisers | ది హండ్రెడ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన కొన్ని గంటలకే సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఎక్స్ ఖాతా సస్పెన్షన్‌కు గురైంది. ఈ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ.2.34 కోట్లు) సన్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది.
Sunrisers | ది హండ్రెడ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన కొన్ని గంటలకే సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఎక్స్ ఖాతా సస్పెన్షన్‌కు గురైంది. ఈ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ.2.34 కోట్లు) సన్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో ఈ పోటీలో భారత్‌కు చెందిన ఫ్రాంచైజీలో చోటు దక్కించుకున్న తొలి పాకిస్థాన్ క్రికెటర్‌గా అబ్రార్ నిలిచాడు. అయితే ఈ నిర్ణయం కొందరు భారత అభిమానులకు నచ్చలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కు చెందిన ఫ్రాంచైజీ ఒక పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా సస్పెన్షన్..
ఈ వ్యవహారంలో ఫ్రాంచైజీతోపాటు సహ యజమాని కావ్య మారన్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును బహిష్కరించాలనే పిలుపు కూడా ఎక్స్ వేదికగా ట్రెండ్ అయింది. అయితే ఎక్స్ సంస్థ సన్ రైజర్స్ లీడ్స్ ఖాతా సస్పెన్షన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. కానీ ఆ ఖాతాను తెరవడానికి ప్రయత్నించిన వినియోగదారులకు Account suspended. X suspends accounts that violate the X rules అనే సందేశం కనిపించింది. ఇక ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్ రెండో పాకిస్థాన్ ఆటగాడిగా అమ్ముడయ్యాడు. అంతకుముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు 1,40,000 పౌండ్లకు (సుమారు రూ.1.72 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు ఐపీఎల్‌తో ఎలాంటి సంబంధం లేదు.
ముస్తాఫిజుర్‌ను కొనుగోలు చేసిన ఫీనిక్స్ జట్టు..
కాగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్, ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ లను వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. అనుభవజ్ఞుడైన ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ముందుగానే వేలం నుంచి తప్పుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మహిళల హండ్రెడ్ వేలంలో పాల్గొన్న పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ లను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. కాగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు 1,00,000 పౌండ్లకు (సుమారు రూ.1.23 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే ఇటీవల టీ20 ప్రపంచకప్‌కు ముందు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేసింది. ఈ పరిణామం తర్వాత జరిగిన సంఘటనల పరంపర చివరకు టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడానికి దారితీసింది. ఇక సస్సెక్స్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్ వేలంలో అత్యధిక ధర సాధించాడు. లండన్ స్పిరిట్ జట్టు అతన్ని 3,90,000 పౌండ్లకు (సుమారు రూ.4.8 కోట్లు) కొనుగోలు చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



