Sunil Gavaskar | అభిషేక్ శర్మకు గవాస్కర్ సలహా.. మొదటి బంతికే బౌండరీ వద్దు..
Sunil Gavaskar | టీ20 వరల్డ్‌కప్ 2026లో గ్రూప్ దశలో ఇప్పటికే భారత్ 3 విజయాలను వరుసగా సాధించింది. సూపర్-8 కు చేరుకుంది. ఈ నెల 18వ తేదీన నెదర్లాండ్స్‌తో తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌ను భారత్ ఆడనుంది.
Sunil Gavaskar | టీ20 వరల్డ్‌కప్ 2026లో గ్రూప్ దశలో ఇప్పటికే భారత్ 3 విజయాలను వరుసగా సాధించింది. సూపర్-8 కు చేరుకుంది. ఈ నెల 18వ తేదీన నెదర్లాండ్స్‌తో తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌ను భారత్ ఆడనుంది. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ ఓపెనర్లలో ఒకడైన అభిషేక్ శర్మ ప్రస్తుతం తాను ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ సున్నా (0) స్కోరుకే ఔట్ అవడం అభిమానులను కలవరపెడుతోంది. రీసెంట్‌గా సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ రాణించాడు. ఆ సిరీస్‌లో అభిషేక్ 5 మ్యాచ్‌లలో వరుసగా 84, 0, 68, 0, 30 పరుగులు చేశాడు. దీన్ని బట్టి చూస్తే అతను ఫామ్‌లోనే ఉన్నాడని అర్థమవుతుంది. ఒక మ్యాచ్ కాకపోయినా ఇంకో మ్యాచ్‌లో రాణిస్తున్నాడని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ ఫెయిలయ్యాడు. అందులోనూ పరుగులు ఏమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో అభిషేక్ ఫామ్‌పై ప్రస్తుతం అందరిలోనూ చర్చ మొదలైంది.
ఇంకా ఖాతా తెరవని అభిషేక్..
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో యూఎస్ఏపై అభిషేక్ పరుగులు ఏమీ చేయలేదు. ఆ తరువాత జీర్ణాశయ ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైనా, పాక్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో అభిషేక్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లోనూ అతను నిరాశపరిచాడు. మళ్లీ సున్నా స్కోరుకే ఔటయ్యాడు. అయితే ఓపెనర్లుగా రాణిస్తారని ఆశలు పెట్టుకున్న సంజు శాంసన్ విఫలం అవడంతో అతన్ని జట్టు నుంచి తప్పించినా అభిషేక్ ఉన్నాడనే ధీమా అందరిలోనూ ఉంది. దీంతో ఇషాన్ కిషన్‌పై భారం పడకుండా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సంజు బాటలోనే అభిషేక్ కూడా పేలవమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ ఒక్కడే పరుగులు చేయాల్సి వస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లోనూ అతను ఒక్కడే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో ఓపెనింగ్ విభాగం ఇప్పుడు కాస్త బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఒకవేళ కిషన్ కూడా త్వరగా అవుట్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ క్రమంలో ప్రస్తుతం అభిషేక్ మళ్లీ మునుపటిలా ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ ముగిసి సూపర్-8కు చేరుతున్నా కానీ అభిషేక్ ఖాతాలో ఇప్పటి వరకు పరుగులు లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
మొదటి బంతికే బౌండరీ ఎందుకు: గవాస్కర్
అయితే అభిషేక్ ఆట తీరులో నిలకడ లోపించిందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూటిగా, సరళంగా సలహా ఇచ్చారు. వరుసగా రెండు డక్స్‌తో టోర్నీని ప్రారంభించిన అభిషేక్ ఆటతీరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముందు ప్రాథమికాలను దృష్టిలో పెట్టుకోవాలని గవాస్కర్ సూచించారు. ముందుగా ఒక సింగిల్ తీయాలి. అంతే.. ఆ తర్వాత కావాలంటే బౌండరీలు కొట్టొచ్చు. ముందుగా ఖాతా తెరవాలి, కాళ్లు కదిలించాలి, క్రీజ్‌లో సెటిల్ కావాలి. ఆ తర్వాతే దూకుడుగా ఆడాలని అన్నారు. న్యూజిలాండ్‌పై అతడు సెంచరీ చేశాడు. అతడు మంచి టచ్‌లోనే ఉన్నాడు. కానీ మంచి ఫామ్‌ను తేలికగా తీసుకోకూడదు. చాలా మంది బ్యాటర్లు అలా చేస్తారు. సెటిల్ కాకముందే బ్యాంగ్ బ్యాంగ్ అనుకుంటారు. క్రీజ్‌లో నిలదొక్కుకున్న తర్వాతే పరిధి దాటి ఆడాలి. అభిషేక్‌లో ఆ సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. అయితే గవాస్కర్ చెప్పిన సలహాలను అభిషేక్ పాటించి తన తదుపరి మ్యాచ్‌లో అలాగే ఆడతాడా, లేదా మొదటి బంతినే బౌండరీకి తరలించాలనే తన యథాప్రకార ఆటతీరును కొనసాగిస్తాడా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



