Scotland Cricket | టీ20 వరల్డ్ కప్‌లో ఆడడంపై స్కాట్లండ్ రియాక్షన్ ఇదే.. అది మర్యాద కాదంటూ..
Scotland Cricket | టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లండ్‌ను చేర్చే అంశంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటివరకు స్కాట్లండ్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని బీబీసీ ఓ కథనంలో వెల్లడించింది. మీడియా కథనాల ప్రకారం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వరల్డ్ కప్ లో పాల్గొనడంపై జనవరి 21వ తేదీలోపు తుది నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ స్పష్టం చేసినట్లు తెలిసింది.
Scotland Cricket | టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లండ్‌ను చేర్చే అంశంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటివరకు స్కాట్లండ్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని బీబీసీ ఓ కథనంలో వెల్లడించింది. బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రావడాన్ని నిరాకరిస్తే, స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేస్తారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ, ఆ దిశగా ఐసీసీ ఎలాంటి అధికారిక సంప్రదింపులు జరపలేదని బీబీసీ స్పష్టం చేసింది. మీడియా కథనాల ప్రకారం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వరల్డ్ కప్ లో పాల్గొనడంపై జనవరి 21వ తేదీలోపు తుది నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ స్పష్టం చేసినట్లు తెలిసింది. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ అంగీకరించకపోతే, ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లండ్‌ను టోర్నీలోకి తీసుకునే అవకాశముందని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే భద్రతా కారణాలను చూపిస్తూ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే.
తరువాత బెస్ట్ టీమ్ స్కాట్లండ్..
ప్రస్తుతం వరల్డ్ కప్‌కు అర్హత పొందని జట్లలో స్కాట్లండ్ అత్యధిక ర్యాంకింగ్‌లో ఉంది. అందువల్ల బంగ్లాదేశ్ తప్పుకుంటే వారే ప్రత్యామ్నాయంగా అవకాశం పొందవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, క్రికెట్ స్కాట్లండ్ అధికారులతో ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదని బీబీసీ పేర్కొంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు గౌరవం ఇస్తూ, తామూ ఈ అంశంపై ఐసీసీతో స్వతహాగా చర్చలు ప్రారంభించే ఉద్దేశం లేదని స్కాట్లండ్ క్రికెట్ అధికారులు తెలిపారు. కానీ తమను ఐసీసీ ఈ విషయంపై సంప్రదిస్తే తాము కూడా స్పందిస్తామని, అప్పటి వరకు ఈ అంశంపై తాము మాట్లాడడం సమంజసం కాదని, అది మర్యాద అనిపించుకోదని వారు స్పష్టం చేశారు.
కాగా ఇదివరకు 2009లో ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు జింబాబ్వే రాజకీయ కారణాలతో తప్పుకోగా, అప్పుడు గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో నెక్స్ట్ బెస్ట్ జట్టుగా నిలిచిన స్కాట్లండ్‌ను ప్రత్యామ్నాయంగా టోర్నీలో చేర్చారు.
నిరాకరిస్తే ఇంకో జట్టుతో ప్రత్యామ్నాయం..
అయితే బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు 2026 ఐపీఎల్ నుంచి తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీబీ మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం లభించలేదు. జనవరి 21లోపు వారు పాల్గొనడంపై నిర్ణయం తీసుకోవాలని బీసీబీ అధికారులకు చెప్పాం. భారత్‌కు రావడాన్ని నిరాకరిస్తే, ర్యాంకింగ్స్ ప్రకారం మరో జట్టుతో భర్తీ చేయాల్సి ఉంటుంది.. అని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. భద్రతా సమస్యలు, జాతీయ గౌరవాన్ని కారణాలుగా చూపుతూ బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌ల కోసం కోల్‌కతా, ముంబైలకు రావడం లేదని ఇప్పటికే ప్రకటించింది. అయితే టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో, ఆ మ్యాచ్‌లను సహా భారత్‌లో జరగాల్సిన వాటిని సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మార్చేందుకు ఐసీసీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా 2027 వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలనే ముందస్తు ఒప్పందం ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



