త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhusudhana Chary | క‌క్ష‌సాధింపులో భాగంగానే హ‌రీశ్‌రావుకు నోటీసులు: మ‌ధుసూద‌నాచారి

Madhusudhana Chary | త్రినేత్ర‌.న్యూస్‌ : కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhana Chary) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిల‌బెట్టుకోలేక‌పోయార‌ని మండిపడ్డారు.

A

Telangana | Published On Jan 20, 2026, 1.41 pm IST

Madhusudhana Chary | క‌క్ష‌సాధింపులో భాగంగానే హ‌రీశ్‌రావుకు నోటీసులు: మ‌ధుసూద‌నాచారి
Advertisement

Madhusudhana Chary | త్రినేత్ర‌.న్యూస్‌ : కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhana Chary) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిల‌బెట్టుకోలేక‌పోయార‌ని మండిపడ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న విలేక‌రులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే స్కీమ్‌ల ప్ర‌భుత్వం అని, కాంగ్రెస్ అంటే స్కాముల ప్ర‌భుత్వం అని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని బీఆర్ఎస్ పోరాడుతున్నందుకే క‌క్ష‌పూరితంగా కేసులు పెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అసెంబ్లీ సాక్షిగా ప్ర‌శ్నిస్తే స‌మాధానం చెప్ప‌లేక పారిపోయార‌ని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తోంద‌ని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య‌మం సందర్భంగా అనేక మందిని జైల్లో పెట్టిన పార్టీ టీడీపీ అని, రేవంత్‌రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నార‌ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్య‌మకారుల‌పై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్‌రెడ్డి రేవంత్ అని నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ‌మైన వ్య‌క్తి హ‌రీశ్‌రావు అని చెప్పారు. రేవంత్‌రెడ్డి నిర్వాకాన్ని నిల‌దీసే రోజు ఆస‌న్న‌మైంద‌న్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే కుట్ర‌పూరితంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని పేర్కొన్నారు. హ‌రీశ్‌రావుకు నోటీసులు ఇస్తే తెలంగాణ స‌మాజం అంతా క‌దిలివ‌చ్చింద‌ని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్‌రెడ్డి అవినీతిపై హ‌రీశ్‌రావు ప్ర‌శ్నిస్తూనే ఉంటార‌ని ఉద్ఘాటించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement