Sanjay Manjrekar | భారత బ్యాటర్లకు కొన్ని లక్షల స్లోయర్ బాల్స్‌ను వేయండి: సంజయ్ మంజ్రేకర్
Sanjay Manjrekar | టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఓటమి అనంతరం కెప్టెన్, కోచ్ తోపాటు మొత్తం టీం మేనేజ్‌మెంట్‌పై పలువురు మాజీలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ విధానాన్ని తప్పుబట్టారు.
Sanjay Manjrekar | టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఓటమి అనంతరం కెప్టెన్, కోచ్ తోపాటు మొత్తం టీం మేనేజ్‌మెంట్‌పై పలువురు మాజీలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ విధానాన్ని తప్పుబట్టారు. టీమిండియా మేనేజ్‌మెంట్ తమ విధానాన్ని పునః పరిశీలించాలని అన్నారు. తదుపరి జరగనున్న జింబాబ్వే, వెస్టిండీస్ మ్యాచ్‌లలో భారత్ కచ్చితంగా పలు మార్పులు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
కొన్ని లక్షల సంఖ్యలో స్లోయర్ బంతులను వేయండి..
స్పిన్ బౌలింగ్, స్లో పిచ్‌లపై నెమ్మదైన బంతులను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలం అవుతున్నారని మంజ్రేకర్ అన్నారు. భారత ప్లేయర్లు తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. భారతజట్టులోని లోపాలను బయట పెట్టినందుకు ఆయన సౌతాఫ్రికా జట్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఓటమి ఆత్మ పరిశీలనకు, జట్టులో మార్పులు చేసేందుకు ఒక అవకాశం ఇచ్చిందని అన్నారు. భారత్ ఇప్పుడు ఏం చేయాలో జట్టు ప్లేయర్లకు బాగా తెలుసని, స్పిన్ పై సాఫ్ట్ హ్యాండ్స్ ఆడే బ్యాటర్లను టాప్ ఆర్డర్‌లో దించాలని అన్నారు. భారత బ్యాటర్లకు కోచ్‌లు కొన్ని లక్షల సంఖ్యలో స్లోయర్ బంతులను వేయాలని, మరో వికెట్ తీసే ఆప్షన్ కోసం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పనిసరిగా ఆడించాలని అన్నారు.
కాగా సౌతాఫ్రికా చేతిలో భారీ పరుగుల తేడాతో ఓటమిపాలు కావడంతో భారత్‌కు ఇప్పుడు నెట్ రన్ రేట్ సమస్య వచ్చి పడింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఆయా మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధించాలి. ఈ క్రమంలో భారత్ ఈ ఓటమితో సెమీఫైనల్ అవకాశాలను చాలా క్లిష్టంగా మార్చుకుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



