Rinku Singh | జట్టు నుంచి దూరమైన రింకు సింగ్.. జింబాబ్వేతో మ్యాచ్‌కు డౌటే..?
Rinku Singh | టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ దారుణ ఓటమి పాలైన అనంతరం తరువాతి మ్యాచ్‌కు జట్టులో ఎవరిని ఉంచాలి, ఎవర్ని తప్పించాలి అన్న విషయంపై టీం మేనేజ్‌మెంట్‌కు ఇప్పటికే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Rinku Singh | టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ దారుణ ఓటమి పాలైన అనంతరం తరువాతి మ్యాచ్‌కు జట్టులో ఎవరిని ఉంచాలి, ఎవర్ని తప్పించాలి అన్న విషయంపై టీం మేనేజ్‌మెంట్‌కు ఇప్పటికే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. అతను ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా చెన్నై నుంచి హుటాహుటిన ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. దీంతో తరువాతి మ్యాచ్‌కు రింకు సింగ్ అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. రింకు మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్ చేశారు కానీ రింకు రాలేదు. దీంతో అతను ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
హాస్పిటల్‌లో చేరిన రింకు తండ్రి..
రింకు సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్‌ను ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని హాస్పిటల్‌లో చేర్పించారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సమాచారం. దీంతో ఎమర్జెన్సీ కారణంగా రింకు సింగ్ జట్టును వదిలినట్లు తెలిసింది. అయితే ఈ నెల 26వ తేదీన చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న మరో సూపర్ 8 మ్యాచ్‌కు రింకు సింగ్ అందుబాటులో ఉంటాడా, లేదా అన్న విషయంపై ప్రస్తుతం స్పష్టత రావల్సి ఉంది. ఇక ఈ టోర్నీలో రింకు సింగ్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. అతను 5 ఇన్నింగ్స్‌లో కేవలం 24 పరుగులే చేశాడు. ఇప్పటి వరకు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో అతను డకౌట్ అయ్యాడు.
అక్షర్ పటేల్‌కు చాన్స్..?
రింకు సింగ్ గైర్హాజరుతో టీమిండియా జింబాబ్వేతో ఆడనున్న మ్యాచ్‌లో అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో బ్యాకప్ బౌలింగ్ ఆప్షన్ లభించినట్లే. అక్షర్ పటేల్ బ్యాటింగ్ కూడా చేయగలడు కనుక బ్యాటింగ్ డెప్త్ కు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. ఇక అటాకింగ్ మైండ్ సెట్‌తో గనక జట్టు వ్యవహరిస్తే స్పిన్‌కు అనుకూలించే చెపాక్ మైదానంలో జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ను కూడా ఆడించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ ఓటమి అనంతరం భారత్‌కు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో చోటు దక్కించుకోవడం అత్యంత క్లిష్టంగా మారింది. జింబాబ్వేతోపాటు వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లోనూ రన్ రేట్ పాజిటివ్ అయ్యేలా భారీ తేడాలో విజయం సాధించాల్సి ఉంటుంది. అలాగే వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా ఓడించాల్సి ఉంటుంది. ఇవి రెండూ జరగకపోతే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Elephants | వైల్డ్‌లైఫ్ క్యాంప్‌లో ఏనుగుల మధ్య ఘర్షణ.. వాటి మధ్యన నలిగి మహిళా టూరిస్ట్ మృతి
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



