త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Salman Ali Agha | పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ ఆఘా కుటుంబానికి వేధింపులు.. సోష‌ల్ మీడియాలో పోస్టు..

Salman Ali Agha | ఇత‌ర దేశాల ప‌రిస్థితి ఏమోగానీ భార‌త్‌, పాకిస్థాన్ ల‌కు చెందిన క్రికెట్ అభిమానులు మాత్రం చాలా వ‌ర‌కు డై హార్డ్ ఫ్యాన్స్‌గా ఉంటారు. త‌మ జ‌ట్టు గెలిస్తే విజ‌యోత్సాహంతో సంబ‌రాలు చేసుకుంటారు. అదే ఓడిపోతే మాత్రం ప్లేయ‌ర్ల‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.

S

Sports | Published On Feb 25, 2026, 12.53 pm IST

Salman Ali Agha | పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ ఆఘా కుటుంబానికి వేధింపులు.. సోష‌ల్ మీడియాలో పోస్టు..
Advertisement

Salman Ali Agha | ఇత‌ర దేశాల ప‌రిస్థితి ఏమోగానీ భార‌త్‌, పాకిస్థాన్ ల‌కు చెందిన క్రికెట్ అభిమానులు మాత్రం చాలా వ‌ర‌కు డై హార్డ్ ఫ్యాన్స్‌గా ఉంటారు. త‌మ జ‌ట్టు గెలిస్తే విజ‌యోత్సాహంతో సంబ‌రాలు చేసుకుంటారు. అదే ఓడిపోతే మాత్రం ప్లేయ‌ర్ల‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఈ క్ర‌మంలోనే పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ ఆఘా కుటుంబానికి కూడా స‌రిగ్గా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌వుతోంది. ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ సూప‌ర్ 8 మ్యాచ్‌లో ఓట‌మి పాల‌వ‌డంతో ఆ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ నుంచి దాదాపుగా నిష్క్ర‌మించే స్థితికి వ‌చ్చింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ ఆఘా కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని సోష‌ల్ మీడియాలో వేధింపుల‌కు గురి చేస్తున్నారు.

త‌మ‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ స‌ల్మాన్ అలీ ఆఘా భార్య ష‌బ్బా మంజెర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని పోస్టు చేసింది. త‌న‌ను లేదా త‌మ కుమారున్ని వేధింపుల‌కు గురి చేసినంత మాత్రాన పాకిస్థాన్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ రాదు, ఆ విష‌యాన్ని ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాల‌ని ఆమె స్టోరీలో చెప్పింది. దీంతో ఆమె పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

త‌ర‌చూ కెప్టెన్ల మార్పు..

కాగా పాకిస్థాన్ జ‌ట్టు ఐసీసీ టోర్నీల్లో ఈ మ‌ధ్య‌కాలంలో అంత చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం లేదు. 2024లో నిర్వ‌హించిన టీ20 వ‌ర‌ల్డ్ కప్‌తోపాటు గ‌తేడాది పాకిస్థాన్ ఆతిథ్యంలోనే జరిగిన చాంపియ‌న్స్ ట్రోఫీలోనూ ఆ జ‌ట్టు సెమీ ఫైన‌ల్‌కు చేరుకోలేక‌పోయింది. మ‌రోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టు కెప్టెన్ల‌ను త‌ర‌చూ మారుస్తోంది. స‌ల్మాన్ అలీ ఆఘాకు 2024లో టీ20ఐ కెప్టెన్‌గా బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అంత‌కు ముందు మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్ కెప్టెన్‌గా ఉండ‌గా అత‌న్ని తొల‌గించి స‌ల్మాన్‌కు చాన్స్ ఇచ్చారు. రిజ్వాన్‌కు ముందు బాబ‌ర్ ఆజం, షాదాబ్ కాన్‌, షాహీన్ అఫ్రిదిలు కూడా కొంత‌కాలం పాటు టీ20ఐల‌కు కెప్టెన్‌లుగా ఉన్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాలేద‌ని పాక్ క్రికెట్ బోర్డు త‌రచూ కెప్టెన్‌ల‌ను మారుస్తూ వ‌చ్చింది. ఇక ఇప్పుడు కూడా పాక్ జ‌ట్టు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌నే చేసింది. ఈ క్ర‌మంలోనే ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Advertisement
Advertisement