త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakistan | ఐసీసీపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు పాకిస్థాన్‌ ప్లాన్‌..? జ‌ట్టు వెంటే న్యాయ నిపుణులు..?

Pakistan | టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రకటించినప్పటికీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.

S

Sports | Published On Feb 3, 2026, 1.01 pm IST

Pakistan | ఐసీసీపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు పాకిస్థాన్‌ ప్లాన్‌..? జ‌ట్టు వెంటే న్యాయ నిపుణులు..?
Advertisement

Pakistan | టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రకటించినప్పటికీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. బహిష్కరణపై నెలకొన్న వివాదం నేప‌థ్యంలో పీసీబీ తన వ్యూహాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. శ్రీలంక-భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీలో పాల్గొనడానికి పాకిస్థాన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అయితే భారత్‌తో జరిగే మ్యాచ్ విషయంలో మాత్రం బహిష్కరణ నిర్ణయం నేరుగా ప్రభుత్వ స్థాయిలో తీసుకుందని, అందుకే ఐసీసీకి ప్రత్యేకంగా లేఖ రాయాల్సిన అవసరం లేదని పీసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

న్యాయ సల‌హా తీసుకున్న పాకిస్థాన్‌..?

ఇది ప్రభుత్వ నిర్ణయం. అధికారిక వేదికలోనే ప్రకటించారు. కాబట్టి ఐసీసీకి రాతపూర్వకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు, అని పీసీబీకి చెందిన వర్గాలు పేర్కొన్నాయి. ఐసీసీ నుంచి వచ్చే ఏవైనా అప్పీళ్లను పీసీబీ పరిగణనలోకి తీసుకోదన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నట్లు సమాచారం. ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకున్నా పీసీబీకి పూర్తి మద్దతుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలకు ముందు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీతో కూడా చర్చలు నిర్వ‌హించారు.

జ‌ట్టు వెంటే న్యాయ నిపుణులు..

భారత్ ఎప్పుడైనా పాకిస్థాన్‌కు వెళ్లబోమని ఐసీసీకి అధికారికంగా తెలిపిందా? ఒక సందర్భంలో ప్రభుత్వ లేఖ చూపాలని కోరినా వారు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మేం రాతపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి?, అని పీసీబీ వర్గాలు ప్రశ్నించాయి. కాగా పాకిస్థాన్ జట్టు సోమవారం సాయంత్రం కొలంబో చేరుకుంది. ఐసీసీతో జరిగే ఏ సమావేశాలకైనా స‌రే సిద్ధంగా ఉండాలని పీసీబీ ఏర్పాట్లు చేసిందని, అవసరమైతే న్యాయ నిపుణులను కూడా జట్టు అధికారులతో పాటు ఉంచేందుకు మొహ్సిన్ నక్వీ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. కాగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్ ప్రభుత్వం, పీసీబీ అనుస‌రిస్తున్న వైఖరి ప‌ట్ల‌ ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

Advertisement
Advertisement