NZ Vs WI | బంతి తగిలి తీవ్రంగా గాయపడ్డ న్యూజిలాండ్ బౌలర్.. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన ప్లేయర్లు..
NZ Vs WI | క్రికెట్ మ్యాచ్‌లలో చిన్నపాటి గాయాలు అవడం సహజమే. ప్లేయర్లు రన్నింగ్ చేసేటప్పుడు లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఇతర సమయాల్లో గాయాలకు గురవుతుంటారు. కానీ గాయం తీవ్రతను బట్టి వారు కోలుకునే సమయం మారుతుంది. అయితే క్రికెట్ లో ప్లేయర్లు తీవ్రమైన గాయాలకు గురైనప్పుడు చుట్టూ ఉన్నవారికి తీవ్రమైన షాక్ తగిలి దిగ్భ్రాంతికి గురవుతుంటారు. అసలు ఏం జరుగుతుందో కాసేపు ఏమీ అర్థం కాదు. అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. వెస్టిండీస్, న్యూజిలాండ్ ల మధ్య వెల్లింగ్టన్‌లో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ లోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ బంతి తగిలి తీవ్ర గాయానికి గురయ్యాడు. దీంతో అతనికి ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాక చుట్టూ ఉన్న ప్లేయర్లందరూ షాక్‌కు గురయ్యారు. కానీ అతను బాగానే ఉన్నాడని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వెస్టిండీస్‌తో వెల్లింగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ చేపట్టింది. దీంతో బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే వెస్టిండీస్ ఇన్నింగ్స్ సమయంలో న్యూజిలాండ్ బౌలర్ మైకేల్ రే వేసిన ఓ బంతిని వెస్టిండీస్ ప్లేయర్ బౌండరీకి తరలించేందుకు షాట్ ఆడాడు. దీంతో బంతి బౌండరీ దగ్గరకు చేరుకోగానే బ్లెయిర్ టిక్నర్ అద్భుతమైన డైవ్‌తో బంతి ఫోర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే అదే క్రమంలో బంతి అతని ఛాతికి తగిలింది. దీంతో అతను నొప్పితో తీవ్రంగా విలవిలలాడిపోయాడు. కాసేపు అతను కదలకుండా అలాగే పడిపోయాడు. దీంతో అతనికి ఏమైందోనని చుట్టూ ఉన్న ప్లేయర్లందరూ హడలెత్తిపోయారు. ఒక్కసారిగా షాక్‌తో దిగ్భ్రాంతికి లోనయ్యారు.
అయితే అప్పటికే మైదానంలోకి చేరుకున్న మెడికల్ సిబ్బంది అతనికి సపర్యలు చేసి అతన్ని స్ట్రెచర్‌పైకి ఎక్కించారు. ఆ సమయంలో బ్లెయిర్ టిక్నర్ స్ట్రెచర్‌పై కూర్చుని ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. దీంతో మైదానంలో ఉన్న ప్లేయర్లు స్టేడియంలో ఉన్న వీక్షకులు ఒక్కసారిగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద గండం తప్పిందని భావించారు. అయితే అతను హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడని టీం మేనేజ్‌మెంట్ తెలియజేసింది. ఇక ఈ సిరీస్‌కు గాను న్యూజిలాండ్ టీమ్‌కు ఇప్పటికే పెద్ద దెబ్బ పడింది. కీలక బౌలర్ అయిన మ్యాట్ హెన్రీతోపాటు విల్ ఓ రూక్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కైలీ జేమిసన్‌లు గాయాలు కారణంగా తప్పుకున్నారు. ఈ క్రమంలో బ్లెయిర్ టిక్నర్ ఈ టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్నాడు.
అయితే దురదృష్టవశాత్తూ న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో మళ్లీ దెబ్బ పడింది. అప్పటికే 4 వికెట్లను తీసిన టిక్నర్ తీవ్రమైన గాయంతో హాస్పిటల్‌లో చేరాడు. దీంతో న్యూజిలాండ్ జట్టుకు ఓ బౌలర్ కోత ఏర్పడింది. అయితే వెస్టిండీస్‌ను 205 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్ ప్రస్తుతం తమ తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు వికెట్లు ఏమీ కోల్పోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ టామ్ లాథమ్, డివాన్ కాన్‌వేలు ఆడుతున్నారు. అయితే బ్లెయిర్ టిక్నర్ పరిస్థితి గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం రాలేదు. కానీ మ్యాచ్ ముగిసే సమయానికి అతనికి హాస్పిటల్‌లో చికిత్స అందుతుందని, అతని పరిస్థితిని అంచనా వేస్తున్నామని, అతని భుజంలో ఎముక పక్కకు జరిగి ఉంటుందని భావిస్తున్నామని టీం మేనేజ్‌మెంట్ తెలియజేసింది.
https://twitter.com/ICC/status/1998638635588137270
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






