Mohammad Kaif | పాండ్యా ఆడి ఉంటే 2023 వరల్డ్ కప్ గెలిచేవాళ్లం: మహ్మద్ కైఫ్
Mohammad Kaif | ఆస్ట్రేలియా క్రికెట్‌పై ఒకప్పుడు మైటీ అనే ముద్ర ఉండేదని, అయితే ఇప్పుడు ఆ స్థాయి ప్రదర్శనలకు వారు దూరమయ్యారని మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ఆడుంటే భారత్ కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించేదని ఆయన స్పష్టం చేశారు.
Mohammad Kaif | ఆస్ట్రేలియా క్రికెట్‌పై ఒకప్పుడు మైటీ అనే ముద్ర ఉండేదని, అయితే ఇప్పుడు ఆ స్థాయి ప్రదర్శనలకు వారు దూరమయ్యారని మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ఆడుంటే భారత్ కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించేదని ఆయన స్పష్టం చేశారు. టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నేపథ్యంలో కైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 వరల్డ్‌కప్ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ఆడలేకపోవడం భారత్‌కు పెద్ద లోటుగా మారిందని కైఫ్ అభిప్రాయపడ్డారు. వరుసగా తొమ్మిది విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో మాత్రం 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ట్రావిస్ హెడ్ చేసిన 137 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించింది. అయితే ఆ మ్యాచ్‌లో హార్దిక్ ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని కైఫ్ అన్నారు.
అస్థిరంగా ఆసీస్ ఫామ్..
సోషల్ మీడియాలో స్పందించిన కైఫ్.. 2023 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియాను మైటీ ఆసీస్ అని పిలిచారు. కానీ ఆ తర్వాత వారి ప్రదర్శన గణనీయంగా పడిపోయింది. 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో వారు ఆ స్థాయిని చూపలేకపోయారు. అహ్మదాబాద్ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ఆడుంటే ఆస్ట్రేలియా అప్పుడే ఓడిపోయి ఉండేదని అన్నారు. ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా ఫామ్ అస్థిరంగా కొనసాగుతోంది. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్గనిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి పాలై సెమీఫైనల్‌కు చేరలేకపోయారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో సెమీఫైనల్‌లోనే నిష్క్రమించారు. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరినా, లార్డ్స్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడి దశాబ్ద కాలంగా కొనసాగిన ఐసీసీ టోర్నీల విజయ పరంపరకు తెరదించారు.
2009 తరువాత మళ్లీ ఇప్పుడే..
టీ20 వరల్డ్‌కప్ 2026లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2021 ఛాంపియన్లైన ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే బయటకు వెళ్లింది. ఐర్లాండ్‌పై ఒక్క విజయం మాత్రమే సాధించగా, జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోవడం, శ్రీలంక చేతిలో ఎనిమిది వికెట్లతో పరాజయం పాలవడం వారి పతనాన్ని స్పష్టంగా చూపించింది. ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఆస్ట్రేలియా సూపర్-8కు అర్హత కోల్పోయింది. ఇది 2009 తర్వాత వారికి ఎదురైన అత్యంత వేగవంతమైన వరల్డ్‌కప్ నిష్క్రమణగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో కైఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియా, ఇప్పుడు అదే స్థాయిలో నిలబడేందుకు తీవ్రంగా కష్టపడుతోందని విశ్లేషకులు, మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
మే 1, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



