త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | తెలంగాణ‌కు సైనిక్ స్కూల్ మంజూరు చేయండి: రేవంత్‌రెడ్డి

Revanth Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సైనికాధికారుల‌ను కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” నిర్వ‌హించారు.

A

Telangana | Published On Jan 15, 2026, 7.50 pm IST

Revanth Reddy | తెలంగాణ‌కు సైనిక్ స్కూల్ మంజూరు చేయండి: రేవంత్‌రెడ్డి
Advertisement

Revanth Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్రానికి సైనిక్ స్కూల్ మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సైనికాధికారుల‌ను కోరారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూల్స్ మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ‌లో గ‌త పదేళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” నిర్వ‌హించారు. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై వారు చ‌ర్చించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరపున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే వికారాబాద్ లో నేవీకి చెందిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్‌కు మూడు వేల ఎకరాలు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని విజ్ఞ‌ప్తి చేశారు. నిరంతరచర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా (తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్), డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement