త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | అలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌

Donald Trump | ఇరాన్‌లో (Iran) ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేస్తున్న(Protesters) వారికి మ‌ర‌ణ శిక్ష‌లు విధింస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే ఇరాన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

G

International | Published On Jan 14, 2026, 8.20 am IST

Donald Trump | అలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఇరాన్‌లో (Iran) ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేస్తున్న(Protesters) వారికి మ‌ర‌ణ శిక్ష‌లు విధింస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే ఇరాన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెర‌గ‌డం, దేశంలో జీవ‌నం భారంగా మార‌డంతో గ‌త రెండు వారాలుగా ఇరాన్‌లో పెద్దఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ప‌లుచోట్ల ఈ నిర‌స‌న‌లు హింస‌కు దారి తీస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 2400 మందికిపైగా మ‌ర‌ణించారు. ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న ప‌లువురిని ప్ర‌భుత్వం అదుపులోకి తీసుకున్న‌ది. వారు దేవునికి వ్య‌తిరేకంగా యుద్ధం చేస్తున్నార‌ని, అలాంటి వారికి మ‌ర‌ణ‌శిక్ష‌లు విధిస్తామంటూ టెహ్రాన్ పాల‌కులు ప్ర‌క‌టించారు. అయితే ఇలాంటి బెదిరింపుల‌ను అమెరికా అధ్య‌క్షుడు ఖండించారు. అధికారులు నిర‌స‌న కారుల‌ను ఉరితీయం ప్రారంభిస్తే తాము చ‌లా బ‌ల‌మైన చ‌ర్య‌లు (Very Strong Action) తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

నిరసనలు కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని నిరసనకారులకు ట్రంప్‌ పిలుపునిచ్చారు. పోరాటం చేసేవారికి సాయం అందిస్తామని పేర్కొన్నారు. ‘ఇరాన్‌ దేశభక్తులారా.. నిరసనలు కొనసాగించండి. మీ ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి. హంతకులు, దాడులు చేసేవారి పేర్లను నమోదు చేసుకోండి. అలా దాడుల‌కు పాల్ప‌డేవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారుల హత్యలు ఆపే వరకు ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నా. నిరసనకారులకు సాయం అందిస్తాం’ అంటూ త‌న‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ నిన‌దించారు.

మరోవైపు ఇరాన్‌పై అమెరికా బెదిరింపుల‌ను ర‌ష్యా ఖండించింది. మ‌ళ్లీ దాడి చేస్తామ‌ని బెదిరించ‌డం ఆమోద‌యోగ్యం కాద‌ని హిత‌వుప‌లికింది. అది టెహ్రాన్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డ‌మే అవుతుంద‌ని పేర్కొంది. ఇక ఇరాన్‌పై అమెరికా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును చైనా త‌ప్పుప‌ట్టింది. ఆదేశంతో వ్యాపారం చేసే దేశాల‌పై 25 శాతం సుంకాలు విధించ‌డాన్ని ఖండిచింది. ర‌క్ష‌ణ‌వాదం అన్ని ప‌క్షాల ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీస్తుంద‌ని పపేర్కొంది.

త‌మ‌పై దాడిచేస్తే గ‌ట్టిగా బ‌దులిస్తామ‌ని ఇరాన్ ర‌క్ష‌ణ మంత్రి అలి లారిజాని (Ali Larijani) చెప్పారు. మ‌ధ్య‌ప్రాచ్యంలోని అమెరికా స్థావ‌రాలు, దాని మిత్ర‌దేశాల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ట్రంప్‌, ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహూల‌ను ఇరాన్ ప్ర‌జ‌ల‌ను చంపుతున్న ప్ర‌ధాన హంత‌కులుగా ప్ర‌క‌టిస్తున్నామ‌న్నారు. వారిద్ద‌రూ దేశంలో నిర‌స‌న‌లను ఎగ‌దోస్తూ, వేలాది మంది చావుకు కార‌ణ‌మ‌వుతున్నార‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement