త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krishnamachari Srikkanth | తిల‌క్ వ‌ర్మకు జ‌ట్టులో ఉండే అర్హ‌త లేదు.. కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఫైర్‌..

Krishnamachari Srikkanth | టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త్ దారుణంగా ఓట‌మి పాల‌వ‌డంపై మాజీ ప్లేయ‌ర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ స్పందించారు. ముఖ్యంగా ఆయ‌న తిల‌క్‌వ‌ర్మ‌పై నిప్పులు కురిపించారు.

S

Sports | Published On Feb 24, 2026, 7.51 am IST

Krishnamachari Srikkanth | తిల‌క్ వ‌ర్మకు జ‌ట్టులో ఉండే అర్హ‌త లేదు.. కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఫైర్‌..
Advertisement

Krishnamachari Srikkanth | టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త్ దారుణంగా ఓట‌మి పాల‌వ‌డంపై మాజీ ప్లేయ‌ర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ స్పందించారు. ముఖ్యంగా ఆయ‌న తిల‌క్‌వ‌ర్మ‌పై నిప్పులు కురిపించారు. ఆ మ్యాచ్‌లో తిల‌క్ ఆడిన తీరు స‌రిగ్గా లేద‌ని, అత‌ను చాలా చెత్త షాట్ ఆడాడ‌ని, అలాంటి షాట్ ఆడిన త‌రువాత తిల‌క్ అస‌లు క్రీజులో ఉండ‌డానికి అర్హుడు కాద‌ని అన్నారు. తిల‌క్‌ను త‌రువాతి మ్యాచ్‌లో త‌ప్పించే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయ‌ని అన్నారు. ఈ మేర‌కు శ్రీ‌కాంత్ త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ఓ వీడియోలో ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కోహ్లి లేని లోటు స్ప‌ష్టం..

ప్ర‌స్తుతం చాలా మంది తిల‌క్ స్థానం గురించి ప్ర‌శ్నిస్తున్నార‌ని శ్రీ‌కాంత్ అన్నారు. సంజు శాంస‌న్‌ను జ‌ట్టులోకి తీసుకువ‌స్తే తిల‌క్ వ‌ర్మ‌కు చోటు ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ భారీ ల‌క్ష్యాల‌ను ఛేదించ‌డంలో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంద‌ని శ్రీ‌కాంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌ట్టులో విరాట్ కోహ్లి లాంటి చేజ్ మాస్ట‌ర్ ఎవ‌రూ లేర‌ని, కోహ్లి లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఒత్తిడి స‌మ‌యంలో మ్యాచ్‌ను ఒంటి చేత్తో మ‌లుపు తిప్పే ప్లేయ‌ర్లు జ‌ట్టులో ప్ర‌స్తుతం ఎవ‌రూ లేర‌ని అన్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇప్ప‌టి వ‌రకు భార‌త్ చేసిన 3 ప్ర‌ధాన చేజ్‌లలో కోహ్లి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడ‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

జ‌ట్టులో మార్పుల‌కు చాన్స్‌..

విరాట్ కోహ్లి లాంటి చేజ్ మాస్ట‌ర్ ప్ర‌స్తుతం జ‌ట్టులో లేర‌ని, అత‌ను లేకుండా భార‌త్ భారీ ల‌క్ష్యాల‌ను ఛేదించ‌డం కష్ట‌మేన‌ని శ్రీ‌కాంత్ అన్నారు. ఇక‌పై అన్ని జ‌ట్లు ముందుగా బ్యాటింగ్ చేసి భార‌త్‌ను చేజ్‌కు దిగేలా చేస్తాయ‌ని, ఇది జ‌ట్టు ముందున్న పెద్ద స‌వాల్ అని అన్నారు. అయితే త‌క్కువ స్ట్రైక్ రేట్‌తో విమ‌ర్శ‌ల పాల‌వుతున్న తిల‌క్‌ను త‌రువాతి మ్యాచ్‌లో త‌ప్పించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, జ‌ట్టులో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని, సంజు శాంస‌న్‌కు చోటు ల‌భించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు సోమ‌వారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘ‌న విజ‌యం సాధించిన త‌రువాత వెస్టిండీస్ నెట్ ర‌న్ రేట్ +5.350గా న‌మోదైంది. ఈ క్ర‌మంలో భార‌త్ సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా క‌చ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఈ నెల 26వ తేదీన అహ్మ‌దాబాద్‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుండగా, అదే రోజు సాయంత్రం చెన్నైలో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో జింబాబ్వేను భార‌త్ ఢీకొట్ట‌నుంది. ఈ రెండు మ్యాచ్‌లు భార‌త్‌కు అత్యంత కీల‌కంగా మారాయి.

Advertisement
Advertisement