Kevin Pietersen | ఐపీఎల్‌లో ఆడడం వల్ల నా క్రికెట్ కెరీర్ ముగిసింది: కెవిన్ పీటర్సన్
Kevin Pietersen | ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాటర్ కెవిన్ పీటర్సన్ తమ దేశ క్రికెట్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు అప్పట్లో ఈసీబీ పరిమితులు విధించగా, తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరి ఆడానని, తాను తీసుకున్న ఆ నిర్ణయం వల్ల కెరీర్ అక్కడితో ముగిసిందని పీటర్సన్ అన్నాడు.
Kevin Pietersen | ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాటర్ కెవిన్ పీటర్సన్ తమ దేశ క్రికెట్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు అప్పట్లో ఈసీబీ పరిమితులు విధించగా, తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరి ఆడానని, తాను తీసుకున్న ఆ నిర్ణయం వల్ల కెరీర్ అక్కడితో ముగిసిందని పీటర్సన్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు అప్పట్లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారులతో గొడవలు జరిగాయని, దాని వల్ల తన క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిందని పేర్కొన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ కూడా ఇందుకు కారణమని అతను అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న కెవిన్ పీటర్సన్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అవి క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అందువల్లే గొడవలు..
ఆ ఇంటర్వ్యూలో పీటర్సన్ మాట్లాడుతూ ఐపీఎల్ ప్రారంభ దశల్లో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తనపై మీడియా ద్వారా విచ్ హట్ ప్రారంభించిందని ఆకోపించాడు. 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్‌లో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ప్లేయర్లను పాల్గొననివ్వకుండా ఈసీబీ నిషేధం విధించిందని, ఆ ఏడాది కేవలం డిమిత్రి మస్కరేనస్ మాత్రమే ఐపీఎల్‌లో ఆడినట్లు తెలిపాడు. తరువాత 2009లో ఐపీఎల్‌లో ఆడేందుకు తమ క్రికెట్ బోర్డు కొన్ని పరిమితులు విధిస్తూ కేవలం3 వారాల పాటు మాత్రమే ఆడాలని చెప్పిందని, అయితే తాను అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరి ఆడినట్లు తెలిపాడు. దీని వల్ల తనకు, తమ బోర్డు ఈసీబీకి మధ్య గొడవలు పెరిగాయని తెలిపాడు.
కెరీర్‌ను కోల్పోయా..
తాను ఐపీఎల్‌లో ఆడడం వల్ల త్యాగాలు చేయాల్సి వచ్చిందని, తన కెరీర్‌ను కోల్పోయానని కెవిన్ అన్నాడు. అందుకే ఆ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు తన మీదకు వచ్చారని, 104 టెస్టు మ్యాచ్ ల తరువాత 33 ఏళ్ల వయస్సులో తన కెరీర్ ముగిసిందని, తాను 150 నుంచి 160 వరకు టెస్టులు ఆడుదామని కలలు కనేవాడినని, 12వేల నుంచి 13వేల వరకు పరుగులు చేయాల్సింది అని అభిప్రాయపడ్డాడు. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదన్నాడు. అయితే అప్పట్లో ఈసీబీ తనపై మీడియా ద్వారా కూడా దాడి చేసిందని కెవిన్ ఆరోపించాడు. ఈసీబీ ది టెలిగ్రాఫ్ ను ఉపయోగించి తనను లక్ష్యంగా చేసుకుందని, అయితే దీనిపై ఇప్పుడు ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశాడు. దీనిపై ఇప్పటికే ఎక్కువగా ప్రచారం జరిగిందని, ఇప్పుడు తాను చాలా సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్నానని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ ప్లేయర్లకు మార్గం సుగమం అవడంలో..
కెవిన్ పీటర్సన్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 8,181 పరుగులు చేయగా, వాటిల్లో 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన వైఖరి కారణంగా కెరీర్‌పై ప్రభావం పడినప్పటికీ భవిష్యత్తులో ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీ క్రికెట్‌లో పాల్గొనే స్వేచ్ఛ కల్పించడంలో కెవిన్ పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. ఆ తరువాతే ఈసీబీ తమ ప్లేయర్లను ఐపీఎల్ సీజన్లకు అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఇక పీటర్సన్ ఐపీఎల్‌లో ఢిల్లీ, హైదరాబాద్ జట్ల తరఫున కూడా ఆడాడు. 2025లో పీటర్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






