త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ishan Kishan | ఐపీఎల్ లో చ‌రిత్ర సృష్టించ‌నున్న ఇషాన్ కిష‌న్‌.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా..

Ishan Kishan | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం ఎం చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది. గత సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్, ఈసారి కొత్త ఆశలతో బరిలోకి దిగుతోంది.

S

Sports | Published On Mar 28, 2026, 12.35 pm IST

Ishan Kishan | ఐపీఎల్ లో చ‌రిత్ర సృష్టించ‌నున్న ఇషాన్ కిష‌న్‌.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా..
Advertisement

Ishan Kishan | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం ఎం చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది. గత సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్, ఈసారి కొత్త ఆశలతో బరిలోకి దిగుతోంది. అయితే రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వెన్ను గాయం కారణంగా టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లకు దూరమవ‌డం జ‌ట్టుకు పెద్ద దెబ్బ‌గా మారింది. కమ్మిన్స్ గైర్హాజరీలో హైదరాబాద్ జట్టుకు యువ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ నాయకత్వం వహించనున్నాడు. ఆర్‌సీబీతో జరిగే ఈ మ్యాచ్ కిషన్ కెరీర్‌లో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది.

అత్యంత యువ భార‌తీయ కెప్టెన్‌గా..

27 సంవత్సరాల‌ 253 రోజుల వయస్సులో కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలో అత్యంత యువ భారతీయ కెప్టెన్‌గా నిలవబోతున్నాడు. మొత్తంగా చూస్తే అతను ఈ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించిన రెండవ అత్యంత యువ కెప్టెన్ అవుతాడు. న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ 2018 సీజన్‌లో 27 సంవత్సరాల‌ 244 రోజుల వయస్సులో ఎస్‌ఆర్‌హెచ్‌ను నడిపించాడు. ఇషాన్ కిషన్‌కు ముందు శిఖర్ ధవన్, మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్ వంటి భారతీయ ఆటగాళ్లు కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించారు. శుక్రవారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ మీట్‌లో హెడ్ కోచ్ డానియల్ వెటోరి, కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేసిన నిర్ణయంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు. కిషన్ ఇప్పటికే విశ్వసనీయ ఆటగాడిగా, నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడని ఆయన పేర్కొన్నారు.

ఇషాన్ కిష‌న్ స‌మ‌ర్థ నాయ‌కుడు: వెటోరి

ఇషాన్ చాలా కాలంగా ఐపీఎల్‌లో ఆడుతున్నాడ‌ని, అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించి విజయాలు సాధించాడ‌ని, ఆ అనుభవం అతనికి విశ్వాసాన్ని ఇస్తుంద‌ని వెటోరి తెలిపారు. కిష‌న్‌ అండర్-19 జట్టుకు, తన రాష్ట్ర జట్టుకు కూడా నాయకత్వం వహించాడ‌ని, ఈ ఏడాది సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ గెలవడం అతని నాయకత్వ లక్షణాలను రుజువు చేసింద‌ని అన్నారు. అతను ధైర్యవంతుడైన ఆటగాడే కాక సమర్థ నాయకుడ‌ని, అతన్ని కెప్టెన్‌గా ఎంపిక చేసేటప్పుడే ఆ ల‌క్ష‌ణాల‌ను పరిగణన‌లోకి తీసుకున్నామ‌ని ఆయన అన్నారు. అభిషేక్‌తో అతని కలయిక కూడా బలంగా ఉంద‌ని, ఇద్దరూ మంచి స్నేహితుల‌ని, జట్టును బాగా అర్థం చేసుకుంటార‌ని అన్నారు. ఈ సీజన్‌లో వారు ముందుండి జట్టును నడిపిస్తారని నమ్ముతున్నాన‌ని వెటోరి వెల్లడించారు. ఇక ఈ సీజన్‌లో ప్రతి ఐపీఎల్ జట్టు భారతీయ కెప్టెన్లతోనే బరిలోకి దిగడం మరో ప్రత్యేకతగా నిలిచింది.

Advertisement

తాజావార్తలు

Advertisement