IPL Playoffs | ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడతారంటే?.. షెడ్యూల్ ఇదే..
IPL Playoffs | ఐపీఎల్ 2026 సీజన్ (IPL Playoffs) చివరి దశకు చేరింది. లీగ్‌దశలో మ్యాచ్‌లు ఆధ్యంతం రసవత్తరంగా సాగాయి. పది జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి.
IPL Playoffs | త్రినేత్ర.న్యూస్: ఐపీఎల్ 2026 సీజన్ (IPL Playoffs) చివరి దశకు చేరింది. లీగ్‌దశలో మ్యాచ్‌లు ఆధ్యంతం రసవత్తరంగా సాగాయి. పది జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. కొన్ని మ్యాచుల్లో ఫలితం కోసం చివరి వరకు ఎదురుచూడగా, మరికొన్నిట్లో గెలిచేదెవరో ముందే తెలిసిపోయింది. సీజన్ మొదట్లో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్, రాజస్థాన్ జట్లు లీగ్ దశ చివరకు మ్యాచ్ వరకు ప్లే ఆఫ్స్ బెర్తు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇక తొలుత అంతంత మాత్రంగానే ఆడిన బెంగళూరు, హైదరాబాద్ క్రమంగా పుంజుకుని పాయింట్ల పట్టికలో మొదటి, మూడో ప్లేస్‌లో నిలిచాయి. అసలు అంచనాలే లేని గుజరాత్ ఏకంగా రెండో స్థానం సంపాదించింది.

స్టార్లు ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న ఐపీఎల్‌లోనే ఖరీదైన జట్టు ముంబై ఇండియన్స్ చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అదిగో, ఇదిగో అంటూ ధోనీ వస్తున్నాడని ఊరించిన చెన్నై చేత్తులెత్తేయగా, లక్నో ఏదశలోనూ పోటీలో నిలువలేకపోయింది. ఇక ఢిల్లీ, కోల్‌కతా జట్లు సోసో అనిపించాయి.
లీగ్ దశలో చివరి రోజున ప్లేఆఫ్స్‌కు వెళ్లే నాలుగో జట్టు ఏదో తెలిసిపోయింది. ముంబైపై విజయంతో రాజస్థాన్ రాయల్స్ టాప్ ఫోర్‌లో నిలిచింది. పంజాబ్, కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లుచల్లింది. కాగా, దీంతో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ బెర్తుల కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు ఆడనున్నారు, ఎప్పుడు పోటీపడతారనే విషయాలు తెలుసుకుందాం..

పోటీ ఎవరితో అంటే..
క్వాలిఫయర్-1
మే 26న పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫయర్-2లో ఆడాల్సి ఉంటుంది.
ఎలిమినేటర్
పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో ఓడిన జట్టు ఇంటికి వేళ్లాల్సి ఉంటుంది. ఇక గెలించిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ మే 27 (బుధవారం) జరుగనుంది. దీనికి ముల్లన్ పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది.

క్వాలిఫయర్-2
ఈ మ్యాచ్ మే 29న (శుక్రవారం) జరగనుంది. క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్లు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.
ఫైనల్
ఆదివారం (మే 31) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయర్ 2లో గెలుపొందిన టీమ్‌తో ఐపీఎల్ 2026 కప్పు కోసం పోటీపడనుంది.

సంబంధిత వార్తలు

Arjun Tendulkar | ఎట్టకేలకు తొలి మ్యాచ్ ఆడిన అర్జున్ టెండుల్కర్
మే 24, 2026

IPL 2026 Playoffs Schedule | ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. అహ్మదాబాద్‌లో 31న ఫైనల్..!
మే 6, 2026

Traffic Restrictions | హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారిమళ్లింపు
మే 6, 2026
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?



