IPL Mini Auction 2026 | ఐపీఎల్ మినీ వేలం 2026.. పూర్తి స్థాయి లిస్ట్ విడుదల చేసిన బీసీసీఐ.. మొత్తం 350 మంది ప్లేయర్ల మధ్య పోటీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. అబుధాబిలో ఈ నెల 16వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మినీ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఈ వేలంలో పాల్గొనే ప్లేయర్ల పూర్తి స్థాయి జాబితాను విడుదల చేసింది. ఇందులో 350 మంది ప్లేయర్లు పోటీ పడనున్నారు. అనేక విధాలుగా ప్లేయర్ల జాబితాను కుదించిన బీసీసీఐ ఎట్టకేలకు 350 మంది ప్లేయర్లతో పూర్తి స్థాయి జాబితాను రిలీజ్ చేసింది. ఈ ప్లేయర్లలో 240 మంది భారత ప్లేయర్లు కాగా, 110 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరందరూ మినీ వేలంలో పోటీ పడనున్నారు. ఇక ఐపీఎల్‌కు సంబంధించి మొత్తం 10 టీమ్‌లు ఈ మినీ వేలం ద్వారా తమకు ఉన్న 77 స్లాట్స్‌ను భర్తీ చేసుకోనున్నాయి. ఈ క్రమంలో 77 స్థానాలకు గాను 350 మంది పోటీ పడనున్నారు.
ఈ జాబితాలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ చివరిగా చేరడం విశేషం. డికాక్ ఈ మధ్యే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకోగా ఐపీఎల్ మినీ వేలం 2026లో పాల్గొనేందుకు చివరి క్షణంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. గతేడాది రూ.2 కోట్లకు గాను ఇతను షారూక్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడాడు. ఇప్పుడు డికాక్ రూ.1 కోటి బేస్ ధరకు ఈసారి మినీ వేలంలో పేరు నమోద చేసుకున్నాడు. అలాగే ఇదే జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఉండడం విశేషం. స్మిత్ రూ.2 కోట్ల బేస్ ధరకు ఈసారి వేలంలో పాల్గొంటున్నాడు. అయితే స్మిత్ చివరిసారిగా 2021 ఐపీఎల్‌లో ఆడాడు. ఈ క్రమంలో ఇతన్ని ఈసారి వేలంలో ఏ జట్టు అయినా కొనుగోలు చేస్తుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్మిత్ ఆసీస్ తరఫున టీ20లలోనూ ఆడడం లేదు.
ఇక ఈ మినీ వేలానికి గాను మొత్తం 1390 మంది ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా బీసీసీఐ ఈ లిస్ట్ ను కుదించి 1005 ప్లేయర్లకు తెచ్చింది. తరువాత పూర్తి స్థాయిలో పరిశీలించి చాలా వరకు ప్లేయర్లను జాబితా నుంచి తొలగించింది. ఈ క్రమంలో 350 మంది ప్లేయర్లతో తుది జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇక వీరు వేలంలో 77 స్లాట్స్‌కు గాను పోటీ పడనున్నారు. దీంతో ఈసారి వేలంలో అదృష్టం ఎవరిని వరిస్తుందా.. అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈసారి కోల్‌కతా జట్టు పర్సు భారీ ఎత్తున నిండుగా ఉండడం విశేషం. వారి వద్ద ఏకంగా 64.3 కోట్లు ప్లేయర్లను కొనేందుకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆ తరువాతి స్థానంలో రూ.43.4 కోట్లో చెన్నై నిలిచింది. ఇక రూ.25.5 కోట్ల భారీ పర్సుతో హైదరాబాద్ తరువాతి స్థానంలో ఉంది. దీంతో ఈ వేలంలో ఈ జట్ల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. కాగా రూ.23.75 కోట్లతో వెంకటేష్ అయ్యర్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా అతన్ని రిలీజ్ చేయడంతో ఇప్పుడు అతను రూ.2 కోట్ల బేస్ ధరకు వేలంలో పాల్గొంటున్నాడు. మరో వైపు రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలో పాల్గొంటున్న ప్లేయర్ల సంఖ్య 40 గా ఉంది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన పంచ్ హిట్టర్లు కామెరాన్ గ్రీన్, జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్, న్యూజిలాండ్‌కు చెందిన డివాన్ కాన్‌వే, సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ తదితర క్రీడాకారులు రూ.2 కోట్ల బేస్ ధర జాబితాలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిని ఏయే ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్



