త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్‌.. పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు రూ.12 ల‌క్ష‌ల ఫైన్‌..

IPL 2026 | ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్‌రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలిచి తమ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది.

S

Sports | Published On Apr 1, 2026, 1.19 pm IST

IPL 2026 | గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్‌.. పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు రూ.12 ల‌క్ష‌ల ఫైన్‌..
Advertisement

IPL 2026 | ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్‌రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలిచి తమ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. ఈ సీజన్‌లో జట్టు చేసిన మొదటి తప్పిదం కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించామ‌ని అధికారులు ఒక‌ ప్రకటనలో పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు వైషాక్ విజయ్‌కుమార్, య‌జ్వేంద్ర చాహల్ కలిపి 5 వికెట్లు తీసి గుజరాత్‌ను 162/6కి పరిమితం చేశారు. బ్యాటింగ్‌లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ పంజాబ్ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కానోలీ 44 బంతుల్లో అజేయంగా 72 పరుగులు చేసి జట్టును విజయ తీరానికి చేర్చాడు.

కూప‌ర్ కానోలీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌..

తన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే కానోలీ అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. మరోవైపు చాహల్ తన అనుభవాన్ని ఉపయోగించి మధ్య ఓవర్లలో గుజరాత్ పరుగులను కట్టడి చేశాడు. అతను 4 ఓవర్లలో 2/28 గణాంకాలు నమోదు చేశాడు. వైషాక్ విజయ్‌కుమార్ 3/34తో ఆక‌ట్టుకున్నాడు. 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ ప్రారంభంలో కొంత కష్టపడింది. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్‌తో 3/29 గణాంకాలు నమోదు చేసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. అయితే కానోలీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37 పరుగులు) రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం జోడించి విజయానికి పునాది వేశారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 27 బంతుల్లో 39, జోస్ బట్లర్ 33 బంతుల్లో 38 పరుగులు చేశారు. అయితే జట్టు మొత్తం ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు.

చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా..

పంజాబ్ ప్రారంభం ఆశించినంతగా సాగ‌లేదు. కగిసో రబాడ వేగంతో ప్రియాంశ్ ఆర్యాను అవుట్ చేశాడు. మిడ్‌వికెట్ వద్ద అశోక్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. తర్వాత కానోలీ, ప్రభ్‌సిమ్రన్ జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లతో గుజరాత్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. రషీద్ ఖాన్ ప్రభ్‌సిమ్రన్‌ను ఔట్ చేసి గుజరాత్‌కు ఆశలు కలిగించాడు. అయితే తర్వాత శ్రేయస్ అయ్యర్ రెండు సిక్సర్లు కొట్టినా, కొద్దిసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ నెహాల్ వధేరాను ఔట్ చేయగా, ప్రసిద్ధ్ కృష్ణ శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్‌లను వరుసగా ఔట్ చేసి మ్యాచ్‌ను మళ్లీ ఉత్కంఠభరితంగా మార్చాడు. అయితే చివర్లో కానోలీ అద్భుతంగా ఆడి 5 సిక్సర్లు, 5 ఫోర్లతో జట్టుకు విజయాన్ని అందించాడు.

Advertisement
Advertisement