Rohit Sharma | రోహిత్ తన చివరి వన్డే ఆడాడా..? వరుసగా 3 మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఫెయిల్..
Rohit Sharma | న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కష్టాలు కొనసాగాయి. మూడోదైన నిర్ణయాత్మక మ్యాచ్‌లో కూడా టాప్ ఆర్డర్‌లో మరోసారి నిరాశాజనక ప్రదర్శననే చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 26, 21 పరుగులతోనే సరిపెట్టుకున్న రోహిత్, సిరీస్ డిసైడర్‌లో కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు.
Rohit Sharma | న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కష్టాలు కొనసాగాయి. మూడోదైన నిర్ణయాత్మక మ్యాచ్‌లో కూడా టాప్ ఆర్డర్‌లో మరోసారి నిరాశాజనక ప్రదర్శననే చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 26, 21 పరుగులతోనే సరిపెట్టుకున్న రోహిత్, సిరీస్ డిసైడర్‌లో కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో అతడు మెరుపుల్లాంటి కొన్ని షాట్లు ఆడినా, వాటిని భారీ ఇన్నింగ్స్‌గా మలచుకోలేకపోయాడు. ఫలితంగా ఐదు నెలల వన్డే విరామానికి ముందు ఒక్క అర్ధశతకం కూడా లేకుండానే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినట్టైంది. అయితే మూడో వన్డేలో రోహిత్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. నాలుగో ఓవర్‌లో న్యూజిలాండ్ డెబ్యూ పేసర్ క్రిస్టియన్ క్లార్క్‌ను ఎదుర్కొన్నాడు. ఆ ఓవర్‌లోనే డ్రామా జరిగింది.
భారీగా తగ్గిన స్ట్రైక్ రేట్, సగటు..
పాయింట్ వైపు బాల్‌ను గైడ్ చేయబోయి ఎడ్జ్ ఇచ్చిన రోహిత్, వెనుక వికెట్‌కీపర్ మిచెల్ హే డైవ్ చేస్తూ క్యాచ్ వదిలేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ ఊపిరి కాసేపే నిలిచింది. కొద్ది సేపటికే అద్భుతమైన కవర్ డ్రైవ్‌తో తన క్లాస్‌ను చూపించాడు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా వచ్చిన బంతిని అంచనా వేయలేక చెక్ ఫ్లిక్ ఆడబోయి మిడ్ ఆన్ వద్ద సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు 28/1గా మారింది. ఇక గత మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ చేసిన పరుగులు 61 కాగా సగటు 20.33 గా నమోదు అయింది. స్ట్రైక్‌రేట్ 76.25 తో అతను ఆడాడు. ఇది అతడి గత సిరీస్‌తో పోలిస్తే భారీగా తగ్గింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి అంతర్జాతీయ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 146 పరుగులు, సగటు 48.66, స్ట్రైక్‌రేట్ 110.60గా ఉంది.
ఈ ప్రదర్శన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత జెర్సీలో రోహిత్ చివరి మ్యాచ్ అవుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోహిత్ ఒకే ఒక ఫార్మాట్ ఆటగాడిగా మిగలడంతో అతడి ఫిట్‌నెస్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఇక భారత్ తదుపరి వన్డే సిరీస్ జూలైలో ఇంగ్లాండ్ పర్యటనలో జరగనుంది. అప్పటికి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి మళ్లీ భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. కానీ టీ20 వరల్డ్ కప్ అనంతరం జరిగే ఐపీఎల్‌లో మాత్రం వీరు తమ తమ జట్లకు ఆడుతూ అభిమానులకు కనువిందు చేయనున్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



