త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaibhav Sooryavanshi | సూర్య‌వంశీ బ్యాంటింగ్‌.. చాగంటి కోటేశ్వ‌ర రావు కామెంట్రీ.. మీరూ చూసేయండి

Vaibhav Sooryavanshi | త‌న‌దైన బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో చిచ్చ‌ర‌పిడుగు వైభ‌వ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. బౌల‌ర్ ఎవర‌నేది లెక్క‌చేయ‌కుండా సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నాడు.

G

Sports | Published On May 29, 2026, 1.15 pm IST

Vaibhav Sooryavanshi | సూర్య‌వంశీ బ్యాంటింగ్‌.. చాగంటి కోటేశ్వ‌ర రావు కామెంట్రీ.. మీరూ చూసేయండి
Advertisement

Vaibhav Sooryavanshi | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న‌దైన బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో చిచ్చ‌ర‌పిడుగు వైభ‌వ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. బౌల‌ర్ ఎవర‌నేది లెక్క‌చేయ‌కుండా సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. క్రీజ్‌లో అత‌డు పాతుకుపోయాడంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు మ్యాచ్‌పై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే అంటే అతిశ‌యోక్తికాదు. అంత‌గా రెచ్చిపోతున్నాడు 15 ఏండ్ల చిచ్చ‌ర‌పిడుగు. ఈ న‌యా ప‌రుగుల‌ య‌త్రానికి ప్రముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు వ్యాఖ్యానం తోడైతే ఎలా ఉంటుంది?. అదే చేశాడో నెటిజ‌న్‌..

ఐపీఎల్ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ త‌న విధ్వంస బ్యాటింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు రాబ‌ట్టాడు. సెంచ‌రీకి చేరువ‌లో ఔట‌య్యాడు. ఈ నేపథ్యంలో, స్టేడియంలో అతడి పోరాటాన్ని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన 'అభిమన్యుడి యుద్ధం' ప్రసంగంతో పోల్చుతూ ఒక నెటిజన్ ఎడిట్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌కు చాగంటి మాటలు స‌రిగ్గా సింక్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు.

చావో రేవో తేల్చుకునే ఆ మ్యాచ్​లో 15 ఏండ్ల సూర్యవంశీ చెలరేగిపోయాడు. 29 బంతుల్లో 334.48 స్టైక్ రేట్‌తో 97 ర‌న్స్ చేశాడు. అందులో 5 ఫోర్లు, 12 సిక్స్​లు బాదాడు. వైభ‌వ్ ధాటికి హైద‌రాబాద్ కెప్టెన్ క‌మిన్స్ 4 ఓవ‌ర్ల‌లో 64 ర‌న్స్ స‌మ‌ర్పించుకున్నాడు. మ‌రోవైపు ఐపీఎల్ ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్సులు బాదిన ఆట‌గాడి యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ (59)పేరున ఉన్న రికార్డును సూర్య‌వంశీ తుడిపేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 61 సిక్సుల్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ రికార్డును త‌న పేరున లిఖించుకున్నాడు.

Advertisement
Advertisement