Cameron Green | రూ.25.20 కోట్లకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. వెంటనే మ్యాచ్‌లో డకౌట్..
Cameron Green | ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారీ ధర పలికిన విషయం విదితమే. అతన్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే రూ.25.20 కోట్ల భారీ ధరకు అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. దీంతో గ్రీన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అతను మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో కోల్‌కతాను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అన్ని కోట్లు పెట్టి కొంటే గ్రీన్ డకౌట్ అయ్యాడని ఎద్దేవా చేస్తున్నారు. కాగా కామెరాన్ గ్రీన్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో యాషెస్ సిరీస్ టెస్టు మ్యాచ్‌లో చీప్‌గా ఔట్ అవడం విమర్శలకు తావిస్తోంది.
కామెరాన్ గ్రీన్ వాస్తవానికి టెస్టు, టీ20, వన్డే అన్ని ఫార్మాట్లలోనూ చక్కని ఆల్ రౌండ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. బంతిని బౌండరీలకు తరలించడంలో దిట్ట. అలాగే పేస్ బౌలింగ్‌తోనూ ఆకట్టుకోగలడు. అందుకనే అతని ఆల్ రౌండర్ ప్రదర్శనకు అతన్ని కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే కోల్‌కతా భారీ ధరకు అతన్ని కొనుగోలు చేయగా, అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక తరువాత రోజు అడిలైడ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్ 3వ టెస్టు మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చినట్లే వచ్చి వెంటనే వెనుదిరిగాడు. షార్ట్ బంతిని కట్ చేయబోయి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో అతన్ని ఉద్దేశించి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం అతనికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
కామెరాన్ గ్రీన్ ను కేవలం ఒక్క మ్యాచ్‌లో డకౌట్ అయినంత మాత్రాన అలా విమర్శించకూడదని, అతను ఒక మ్యాచ్ విన్నర్ అని, కచ్చితంగా రాణిస్తాడని, ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉంది కనుక తనను తాను రుజువు చేసుకుంటాడని అంటున్నారు. ఇక యాషెస్ సిరీస్ 3వ టెస్టులో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లను కోల్పోయి 326 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో స్టార్క్, లయాన్ ఉన్నారు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ సెంచరీ (106)తో ఆకట్టుకోగా మరో బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా (82) చెప్పుకోదగిన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా, బ్రైడాన్ కార్స్, విల్ జాక్స్ చెరో 2 వికెట్లు తీశారు. జాష్ టంగ్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయాలతో 2-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

Usman Tariq | మళ్లీ వివాదాస్పదమవుతున్న పాక్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్.. కామెరాన్ గ్రీన్ ఏమన్నాడు..?
ఫిబ్రవరి 1, 2026

Ashes Series 2025-26 | యాషెస్ సిరీస్ 5వ టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 384 పరుగులకు ఆలౌట్..
జనవరి 5, 2026

Alex Carey | ఆసీస్ ప్లేయర్ అలెక్స్ క్యారీ నాటౌట్ పై దుమారం.. పనిచేయని టెక్నాలజీ..
డిసెంబర్ 18, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



