BCCI | సన్ రైజర్స్ వ్యవహార శైలిపై బీసీసీఐ స్పందన ఇదే.. రాజీవ్ శుక్లా సమాధానం..
BCCI | పాకిస్థాన్ ఆల్ రౌండర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ యాజమాన్యం ది హండ్రెడ్ లీగ్ వేలంలో భాగంగా కొనుగోలు చేసిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తుండడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ది హండ్రెడ్ లీగ్ విదేశాలకు చెందినదని, దాంతో ఐపీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
BCCI | పాకిస్థాన్ ఆల్ రౌండర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ యాజమాన్యం ది హండ్రెడ్ లీగ్ వేలంలో భాగంగా కొనుగోలు చేసిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తుండడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ది హండ్రెడ్ లీగ్ విదేశాలకు చెందినదని, దాంతో ఐపీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ది హండ్రెడ్ లీగ్ తమ పరిధిలోకి రాదని, ఈ విషయంలో తాము కలగజేసుకోలేమని స్పష్టం చేశారు. విదేశీ లీగ్‌లతో ఐపీఎల్‌కు సంబంధం లేదని, ఆయా లీగ్‌లలో పాల్గొనే ఫ్రాంచైజీల పట్ల తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపారు. కాగా కావ్య మారన్ సహ యజమానురాలిగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ది హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ది హండ్రెడ్ లీగ్‌కు నిర్వహించిన వేలంలో సన్ రైజర్స్ లీడ్స్ జట్టుకు గాను పాక్ ప్లేయర్ అబ్రార్‌ను 1.90 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. దీంతో కావ్య మారన్‌పై నెటిజన్లు భగ్గుమన్నారు. వచ్చే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును నిషేధించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై రాజీవ్ శుక్లా స్పష్టత ఇచ్చారు.
వ్యతిరేకిస్తున్న భారత ఫ్యాన్స్, థాంక్స్ చెబుతున్న పాక్ ఫ్యాన్స్..
కాగా పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ గతంలో టీమిండియాను అవమానించేలా టీ కప్పులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతను ఆసియా కప్, చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల సందర్భంగా భారత ప్లేయర్లతో అవమానకరంగా వ్యవహరించాడని, పహల్గాం దాడిని ఇంకా మరిచిపోకముందే పాక్ ప్లేయర్‌ను సన్ రైజర్స్ ఎలా కొనుగోలు చేస్తుందని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున కావ్య మారన్‌పై ఫైర్ అవుతున్నారు. సన్ రైజర్స్‌కు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చామని, కానీ కావ్య మారన్ చేసిన పనికి ఇకపై ఐపీఎల్‌లో ఆమె టీమ్‌కు మద్దతు ఇచ్చేది లేదని పలువురు హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మరోవైపు పాకిస్థాన్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఆట అని, రాజకీయాలకు తావు లేదని, భారత అభిమానులు రాజకీయాలను పక్కన పెట్టాలని, తమ ప్లేయర్‌ను కొన్నందుకు కావ్యకు థాంక్స్ అని చెబుతున్నారు.
ఉస్మాన్ తారిక్‌కు 1.40 లక్షల పౌండ్లు..
ఇక ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ 1.40 లక్షల పౌండ్లకు కొనుగోలు చేసింది. కానీ ఇతర పాక్ ప్లేయర్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. పాక్ పేసర్ షాహిన్ షా అఫ్రిది మాత్రం లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక సన్‌రైజర్స్ యాజమాన్యానికి ఇప్పటికే సౌతాఫ్రికాకు చెందిన ఎస్ఏ20 లీగ్‌లోనూ ఫ్రాంచైజీ ఉంది. ఆ లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను కావ్య మారన్ గతంలో ఎప్పుడో కొనుగోలు చేశారు. ఆ లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు అత్యంత విజయవంతమైన టీమ్‌గా నిలిచింది.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



