త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhishek Sharma | అభిషేక్ శ‌ర్మ చెత్త రికార్డ్‌.. టీ20ల్లో అత్యధికసార్లు డకౌట్‌

Abhishek Sharma | అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) .. ఈ పేరు విన‌గానే వెంట‌నే గుర్తొచ్చేది హార్డ్ హిట్టింగ్‌. సిక్స‌ర్ల మోత‌మోగించే ఈ స‌న్‌రైజ‌ర్స్ హైద‌ర‌బాద్ (SRH) ఓపెన‌ర్ త‌న బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో జ‌ట్టును గెలిపించాడు. అయితే అత‌నిపేర ఓ చెత్త రికార్డు ఉంది.

G

Sports | Published On May 28, 2026, 7.03 am IST

Abhishek Sharma | అభిషేక్ శ‌ర్మ చెత్త రికార్డ్‌.. టీ20ల్లో అత్యధికసార్లు డకౌట్‌
Advertisement

Abhishek Sharma | త్రినేత్ర‌.న్యూస్‌: అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) .. ఈ పేరు విన‌గానే వెంట‌నే గుర్తొచ్చేది హార్డ్ హిట్టింగ్‌. సిక్స‌ర్ల మోత‌మోగించే ఈ స‌న్‌రైజ‌ర్స్ హైద‌ర‌బాద్ (SRH) ఓపెన‌ర్ త‌న బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో జ‌ట్టును గెలిపించాడు. అయితే అత‌నిపేర ఓ చెత్త రికార్డు ఉంది. ఒక క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన (Duck out) బ్యాటర్​గా తన పేరుపై ఉన్న చెత్త రికార్డ్​ను మరింత‌ మెరుగుపర్చుకున్నాడు.

బుధ‌వారం ఐపీఎల్ ఎలిమినేట‌ర్‌లో భాగంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు బంతులు ఆడిన అభిషేక్ ఒక్క పరుగు చేయకుండానే అయ్యాడు. దీంతో ఈ ఏడాది అతడకి టీ20ల్లో డ‌కౌట్‌ అవ్వడం ఇది ఎనిమిదోసారి. ఈ జాబితాలో రోహిత్ శ‌ర్మ‌, సంజు శాంస‌న్ అత‌ని త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన భారత బ్యాటర్లు

8 - అభిషేక్ శర్మ, 2026లో (28 ఇన్నింగ్స్‌లు)*
6 - రోహిత్ శర్మ, 2018లో (32 ఇన్నింగ్స్‌లు)
6 - సంజు శాంసన్, 2024లో (32 ఇన్నింగ్స్‌లు)

మ్యాచ్ విష‌యానికొస్తే..

చండీగ‌ఢ్ వేదిక‌గా జ‌రిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌​లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఎస్ఆర్‌హెచ్‌​కు రాజ‌స్థాన్ (RR) షాకిచ్చింది. వైభ‌వ్ మెరుపుల‌కు ఆర్చ‌ర్ బౌలింగ్ తోడ‌వ‌డంతో 47 పరుగుల తేడాతో విజయం సాధించి ఆర్ఆర్‌ క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ 8 వికెట్ల న‌ష్టానికి 244 పరుగులు చేసింది. ఛేదనలో సన్​రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది.

వైభవ్ (97 పరుగులు, 29 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడి తర్వాత ధ్రువ్ జురెల్ (50 పరుగులు) కూడా మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (29 పరుగులు), రియాన్ పరాగ్ (26 పరుగులు) ఫర్వాలేదనిపించారు. భారీ ఛేదనలో సన్​రైజర్స్​కు రెండో బంతికే పెద్ద దెబ్బ తగిలింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ తర్వాతి బాల్‌కే కీపర్​కు క్యాచ్ ఇచ్చి డ‌కౌట్‌గా వెనుతిరిగాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33 పరుగులు) వేగంగా ఆడే ప్ర‌య‌త్నంలో ఆర్చర్‌కు త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు స్వ‌ల్ప స్కోర్ల‌కే ఔట‌వ‌డంతో హైద‌రాబాద్ ఓట‌మి ఖ‌రార‌యింది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement