Winter Olympics | వింటర్ ఒలింపిక్స్‌లో వింత సమస్య.. అథ్లెట్లకు కండోమ్‌ల కొరత..!
Winter Olympics | ఇటలీలోని మిలాన్-కోర్టినాలో వింటర్ ఒలింపిక్స్‌లో వింత సమస్య ఎదురైంది. క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ఉచితంగా అందుబాటులో ఉంచిన కండోమ్ స్టాక్ అంతా మూడురోజుల్లోనే నిండుకుంది. దాంతో నిర్వాహకులు మళ్లీ స్టాక్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Winter Olympics | ఇటలీలోని మిలాన్-కోర్టినాలో వింటర్ ఒలింపిక్స్‌లో వింత సమస్య ఎదురైంది. క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ఉచితంగా అందుబాటులో ఉంచిన కండోమ్ స్టాక్ అంతా మూడురోజుల్లోనే నిండుకుంది. దాంతో నిర్వాహకులు మళ్లీ స్టాక్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒలింపిక్స్ మొదలైన వెంటనే సుమారు 10వేల కండోమ్స్ ప్యాకెట్స్‌ను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. దాదాపు 92దేశాల నుంచి 2,900 మందికిపైగా అథ్లెట్లు రావడంతో నిల్వలు పూర్తయ్యాయి. కేవలం మూడురోజుల్లోనే స్టాక్ అయిపోందని.. మళ్లీ స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలియదంటూ ఓ అథ్లెట్‌ను ఉటంకిస్తూ ఇటాలియన్ మీడియా కథనం ప్రచురించింది. ఒలింక్స్ సమయంలో క్రీడాకారులకు ఉచితంగా కండోమ్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.
1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఒలింపిక్స్ వంటి ఈవెంట్ల నేపథ్యంలో అథ్లెట్లు అందరూ చాలారోజుల పాటు దగ్గరగా ఉంటారు. ఈ సమయంలో సురక్షితంగా శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఆటల కంటే ఎక్కువగా ఇదే అంశం వార్తల్లో నిలిచేది. దాంతో నిర్వాహకులు కండోమ్స్‌ను సరఫరా చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ సమయంలో దాదాపు 3లక్షలకుపైగా పురుష కండోమ్స్, మహిళలకు సైతం ప్రత్యేకమైన కండోమ్స్‌ను అందించారు. తాజాగా మిలాన్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో కేవలం 10వేలు మాత్రమే నిల్వలు ఉండడంతో సమస్యలు ఎదురయ్యాయి. ఊహించని స్థాయిలో అథ్లెట్ల నుంచి డిమాండ్ ఉండడంతో కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్వాహకులు వెంటనే రంగంలోకి దిగి స్టాక్‌ను అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఒలింపిక్స్ ముగిసే వరకు కొరత లేకుండా చూస్తామని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






