CAN Vs UAE | కెనడాపై ఐదు వికెట్ల తేడాతో యూఏఈ విన్..!
CAN Vs UAE | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-డీ మ్యాచ్‌లో కెనడాపై యూఏఈ విజయం సాధించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఓపెనర్లు ఆర్యాన్ష్ శర్మ, సోహైబ్ ఖాన్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
CAN Vs UAE | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-డీ మ్యాచ్‌లో కెనడాపై యూఏఈ విజయం సాధించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఓపెనర్లు ఆర్యాన్ష్ శర్మ, సోహైబ్ ఖాన్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హర్ష్ ఠాకర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. లక్ష్య ఛేదనలో యూఏఈ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 151 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-డీ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అఫ్ఘనిస్థాన్‌ని వెనక్కి నెట్టి యూఏఈ మూడో స్థానానికి చేరుకుంది. దాంతో సూపర్8 పోటీ ఆసక్తికరంగా మారింది. అఫ్ఘనిస్థాన్ నాలుగో స్థానికి పడిపోతే సూపర్ 8కి చేరడం కష్టమే. ఆడిన రెండు మ్యాచుల్లో విజయాలతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.
ఓటమి అంచు నుంచి విజయ తీరాలకు..
కెనడా విధించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఒక దశలో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఆర్యాన్ష్, సోహైబ్ ఐదో వికెట్‌కు కేవలం 42 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. చివరి ఓవర్లో యూఏఈకి గెలవడానికి ఎనిమిది పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే ఆర్యాన్ష్ సిక్సర్ కొట్టగా, రెండో బంతికి ఒక పరుగు తీశాడు. ఇక మూడో బంతికి సోహైబ్ అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 51 పరుగులు చేయగలిగాడు. అయితే, యూఏఈ జట్టు స్థిరంగా ఆడి విజయం సాధించింది. ఆర్యాన్ష్ 53 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 74 పరుగులు చేసి నిలిచాడు. మిగతా బ్యాటర్లలో అలీషాన్ షరఫు (5), హర్షిత్ కౌశిక్ (5), మహ్మద్ వసీం (4), మయాంక్ కుమార్ (4) పరుగులు చేశారు. కెనడా తరఫున సాద్ బిన్ జాఫర్ మూడు వికెట్లు తీశాడు. కలీమ్ సనా, జాస్కరన్ సింగ్ తలో వికెట్ దక్కింది.
కెనడా బ్యాటింగ్‌ను కుప్ప కూల్చిన సిద్దిఖీ
తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా బ్యాటింగ్ లైనప్‌ని జునైద్ సిద్ధిఖీ దెబ్బతీశాడు. నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆరంభంలోనే కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపి ఒత్తిడి పెంచాడు. కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ సింగ్ (11) తొలి ఓవర్లో హైదర్ అలీ బౌలింగ్‌లో బౌండరీ కొట్టినా.. ఆ తర్వాది ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి మహ్మద్ వసీం చేతికి చిక్కాడు. హర్ష్ ఠాకర్ 41 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. 38 పరుగులకే మూడు వికెట్లు పడిన సమయంలో నవనీత్ ధలీవాల్‌తో కలిసి 47 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ధలీవాల్ 28 బంతుల్లో నాలుగు ఫోర్లతో 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






