త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ఆర్‌సీబీ అభిమానులు ఎగిరిగంతేసే వార్త‌.. చిన్నస్వామిలో ఐదు మ్యాచుల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌..!

IPL 2026 | ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) గుడ్‌న్యూస్ చెప్పింది. హోంగ్రౌండ్ చిన్న‌స్వామి స్టేడియంలో ఐదు మ్యాచులు ఆడేందుకు క‌ర్నాట‌క ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఈ విష‌యాన్ని ఫ్రాంచైజీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.

P

Sports | Published On Mar 3, 2026, 9.15 pm IST

IPL 2026 | ఆర్‌సీబీ అభిమానులు ఎగిరిగంతేసే వార్త‌.. చిన్నస్వామిలో ఐదు మ్యాచుల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌..!
Advertisement

IPL 2026 | ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) గుడ్‌న్యూస్ చెప్పింది. హోంగ్రౌండ్ చిన్న‌స్వామి స్టేడియంలో ఐదు మ్యాచులు ఆడేందుకు క‌ర్నాట‌క ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఈ విష‌యాన్ని ఫ్రాంచైజీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. మిగ‌తా రెండు మ్యాచులు రాయ్‌పూర్‌లోని ష‌హీద్ వీర్ నారాయ‌ణ్ సింగ్ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. గ‌తేడాది చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఆ విషాదక‌ర ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. విచార‌ణ జ‌రిపిన అధికారులు స్టేడియంలో కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. అనంత‌రం చిన్నస్వామి స్టేడియంలో రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ, మహారాజా ట్రోఫీ, కేఎస్‌సీఏ టీ20 వంటి కీల‌క టోర్నీల‌ను సైతం నిర్వ‌హించ‌లేదు. ఈ క్ర‌మంలో ఆర్సీబీ హోం గ్రౌండ్ మ్యాచుల విష‌యంలో అనిశ్చితి నెలకొంది. తాజా ప్ర‌భుత్వం ఐదు మ్యాచులు నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌డంతో అభిమానులు ఊర‌ట క‌లిగిన‌ట్ల‌య్యింది. ఈ సంద‌ర్భంగా క‌ర్నాట‌క ప్ర‌భుత్వం, పోలీసులు, కేఎస్‌సీఏకు ఆర్సీబీ కృతజ్ఞతలు తెలిపింది.

పలుమాసాల ఐపీఎల్‌ సీజన్‌కు ముందుగా మౌలిక వసతులు, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో క‌ర్నాట‌క ప్రభుత్వం, క్రికెట్‌ అసోసియేషన్‌, పోలీసుల‌తో క‌లిసి సమ‌ష్టిగా ప‌ని చేసిన‌ట్లు పేర్కొంది. ఈ సంద‌ర్భంగా ఆర్సీబీ సీఈవో రాజేశ్ మెనన్ మాట్లాడుతూ చిన్నస్వామి స్టేడియం మా హోం గ్రౌండ్‌ మాత్రమే కాద‌ని.. త‌మ జ‌ట్టు అస్తిత్వ‌మ‌న్నారు. కఠిన సమయాల్లోనూ త‌మ‌కు అండ‌గా నిలిచార‌న్నారు. ఇక రాయ్‌పూర్‌లో జరిగే రెండు హోం మ్యాచ్‌లు ముందస్తుగా కుదిరిన ఒప్పందం ప్రకారమే నిర్వహిస్తామని ఫ్రాంచైజీ వెల్లడించింది. అవసరమైన అన్ని అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి, సంబంధిత అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు నిర్వహించగలగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన కర్ణాటక ప్రభుత్వం, కేఎస్‌సీఏ, కర్ణాటక పోలీసులకు ఆర్సీబీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement