BCCI | ఐసీసీ టోర్నీ విజేతలను సత్కరించనున్న బీసీసీఐ.. ఈ 15న ఢిల్లీలో వేడుక..!
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక పురస్కార కార్యక్రమం ‘నమన్’ ఈ నెల 15న న్యూఢిల్లీలో జరుగనున్నది. ఏడాది కాలంలో ఐసీసీ టోర్నీలో విశేష విజయాలను సాధించిన ఐదు భారత జట్లను ఈ కార్యక్రమంలో సత్కరించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక పురస్కార కార్యక్రమం ‘నమన్’ ఈ నెల 15న న్యూఢిల్లీలో జరుగనున్నది. ఏడాది కాలంలో ఐసీసీ టోర్నీలో విశేష విజయాలను సాధించిన ఐదు భారత జట్లను ఈ కార్యక్రమంలో సత్కరించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. భారత క్రికెట్ ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను గుర్తుచేసుకునే వేడుకగా కార్యక్రమం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 2024–25 సీజన్‌లో ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు అందజేయనున్నట్లు చెప్పారు.
ఐసీసీ టైటిల్స్ గెలిచిన జట్లకు గౌరవం
ఏడాది కాలంలో ఐసీసీ టోర్నీల్లో విజేతలుగా నిలిచిన ఐదు భారత జట్లను కార్యక్రమంలో ప్రత్యేకంగా బీసీసీఐ సత్కరించనున్నది. టీ20 ప్రపంచకప్ సాధించిన మెన్స్ జట్టుతో పాటు 2025 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన సీనియర్ వుమెన్స్ జట్టు, ఆయుష్ మాత్రే నేతృత్వంలోని అండర్-19 వరల్డ్ కప్ విజేత, 2025 అండర్-19 వుమెన్స్ ప్రపంచకప్ బాలికల జట్లను సత్కరించనున్నది. కోచ్‌లతో పాటు సపోర్ట్ స్టాఫ్ సభ్యులను కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఈ నెల 15న ఢిల్లీలో బీసీసీఐ అవార్డుల వేడుక జరుగుతుందన్నారు. ఐసీసీ టోర్నీల్లో విజేతలతో పాటు భారత జట్ల ఆటగాళ్లు, కోచ్‌లను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు.
చాంపియన్ ట్రోఫీ విజేతను కూడా..
2025లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు సభ్యులను కూడా కార్యక్రమంలో గౌరవించనున్నట్లు సైకియా వెల్లడించారు. గత ఏడాది కాలంలో భారత జట్లు మొత్తం ఐదు ఐసీసీ ట్రోఫీలు సాధించాయని, ఆయా ఆ జట్లలోని సభ్యులందరినీ సత్కరిస్తామన్నారు. ఇది భారత క్రికెట్ విజయాలను జరుపుకునే ప్రత్యేక సాయంత్రమవుతుందని ఆయన తెలిపారు. ఈ సమాచారం మేరకు న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ కార్యక్రమం సాయంత్రం నిర్వహించనున్నారు. అయితే, త్వరలోనే ఐపీఎల్ మొదలుకానుండడంతో బీసీసీఐ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మార్చి 28న టోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకు ముందు జట్లన్నీ సన్నాక శిబిరాలను ప్రారంభించనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






