త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | ముగ్గురు దిగ్గ‌జాల‌కు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.. ప్ర‌క‌టించిన బీసీసీఐ..!

BCCI | బీసీసీఐ న‌మ‌న్ అవార్డులు కార్య‌క్ర‌మం ఆదివారం ఢిల్లీ వేదిక‌గా జ‌రుగ‌నున్న‌ది. ఈ సంద‌ర్భంగా భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌కు బీసీసీఐ ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్ర‌దానం చేయ‌నున్న‌ది. వుమెన్స్ విభాగంలో వ‌రుస‌గా ఐదోసారి స్మృతి మంధాన ఉమెన్స్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును అందుకోనున్న‌ది.

P

Sports | Published On Mar 14, 2026, 4.18 pm IST

BCCI | ముగ్గురు దిగ్గ‌జాల‌కు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.. ప్ర‌క‌టించిన బీసీసీఐ..!
Advertisement

BCCI | బీసీసీఐ న‌మ‌న్ అవార్డులు కార్య‌క్ర‌మం ఆదివారం ఢిల్లీ వేదిక‌గా జ‌రుగ‌నున్న‌ది. ఈ సంద‌ర్భంగా భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌కు బీసీసీఐ ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్ర‌దానం చేయ‌నున్న‌ది. వుమెన్స్ విభాగంలో వ‌రుస‌గా ఐదోసారి స్మృతి మంధాన ఉమెన్స్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును అందుకోనున్న‌ది. ఈ అవార్డును గిల్ రెండోసారి అందుకోనున్నాడు. ఇంతకు ముందు 2023లో పాలి ఉమ్రిగ‌ర్ అవార్డును అందుకున్నాడు. దీంతో దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ స‌ర‌స‌న గిల్ నిలువ‌నున్నాడు. ఇద్ద‌రు రెండుసార్లు ఈ అవార్డును అందుకున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుసార్లు, బుమ్రా మూడుసార్లు ఈ గౌర‌వాన్ని అందుకోవ‌డం విశేషం.

గిల్ 2025లో టెస్ట్, వన్డే క్రికెట్‌లో అద్భుతంగా రాణించారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆయనకు స్థానం దక్కకపోయినా, మిగతా రెండు ఫార్మాట్లలో మాత్రం మెరుగైన ప్రదర్శన క‌న‌బ‌రిచాడు. టెస్టుల్లో మొత్తం 983 పరుగులు సాధించారు. అందులో ఇంగ్లండ్‌తో వారి సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన సిరీస్‌లోనే 754 పరుగులు చేశారు. ఆ సిరీస్‌లో ఆయన సగటు 70కిపైగా స‌గ‌టుతో ప‌ర‌గులు సాధించాడు. జట్టుకు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వన్డేల్లో సైతం గిల్ మంచి ఫామ్ కొన‌సాగించాడు. మొత్తం 490 పరుగులు చేశారు. అందులో భారత జట్టు గెలిచిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ ట్రోనీలో 188 ప‌రుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి గత ఏడాది గిల్ మొత్తం 1,764 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచ‌రీలున్నాయి. స‌గ‌టు 49గా న‌మోదైంది. అలాగే, ఐపీఎల్‌లోనూ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే దాదాపు 50 స‌గ‌టుతో 650 ప‌రుగులు చేశాడు.

ఈ అవార్డుల కార్య‌క్ర‌మంలో కర్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను మాజీ భారత క్రికెటర్లు రోజ‌ర్ బిన్ని, రాహుల్ ద్ర‌విడ్‌కు ప్ర‌దానం చేయ‌నున్న‌ది. అలాగే, భార‌త వుమెన్స్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజ్‌కు సైతం ఈ గౌర‌వం ద‌క్క‌నుంది. బిన్నీ గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సేవ‌లందించాడు కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ 2024లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మహిళల క్రికెట్‌కు చేసిన సేవలకు మిథాలీ రాజ్‌ను సత్కరించనున్నారు.

ముంబ‌యికి చెందిన యువ క్రికెట‌ర్ ఆయుష్ మాత్రేను బీసీసీఐ స‌త్క‌రించ‌నుంది. దేశీయ పరిమిత ఓవర్ల టోర్నీల్లో బెస్ట్ ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యారు. ఈ సంద‌ర్భంగా లాలా అమర్‌నాథ్ అవార్డును అందించ‌నున్న‌ది. మరోవైపు విదర్భకు చెందిన హ‌ర్ష్ దూబే 2024-25 రంజీ సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఉత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపును పొందాడు. అలాగే, సూర్య‌కుమార్ నేతృత్వంలోని భారత జట్టు గెలిచిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టుతో పాటు ఇటీవ‌ల ఐసీసీ ట్రోఫీలు గెలిచిన మొత్తం ఐదు జ‌ట్ల‌ను న‌మ‌న్ అవార్డుల కార్య‌క్ర‌మంలో బీసీసీఐ స‌త్క‌రించ‌నున్న‌ది. 2025 మహిళల ప్రపంచకప్ విజేత, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత, 2026 అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టు, 2025 మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేత జ‌ట్లున్నాయి.

Advertisement
Advertisement