BCCI | మహిళా క్రికెటర్లు, అంపైర్లకు పండగే.. మ్యాచ్ ఫీజును భారీగా పెంచిన బీసీసీఐ..
BCCI | దేశవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు, అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు, ఇతర మహిళా అధికారులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి చెల్లిస్తున్న మ్యాచ్ ఫీజును భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
BCCI | దేశవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు, అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు, ఇతర మహిళా అధికారులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి చెల్లిస్తున్న మ్యాచ్ ఫీజును భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో వారికి చెల్లిస్తున్న ఫీజు పెంచుతారని అప్పుడే వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ ఎట్టకేలకు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్ని ఫార్మాట్లలో అన్ని టీమ్‌లలో ఆడుతున్న మహిళా క్రికెటర్లతోపాటు అంపైర్లు, ఇతర మహిళా అధికారులకు కూడా మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఏపెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారు.
సీనియర్ మహిళా క్రికెటర్లు ఇప్పటి వరకు దేశవాళీ టోర్నీల్లో ఆడితే ఒక రోజుకు రూ.20వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.10వేలు చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఆ ఫీజును భారీ మొత్తంలో పెంచారు. ఆ ప్లేయర్లకు ఇప్పుడు ఒక మ్యాచ్‌కు ఒక రోజుకు రూ.50వేల నుంచి రూ.60వేల వరకు చెల్లించనున్నారు. అలాగే దేశవాళీ వన్డేల్లో ఆడే సీనియర్ మహిళా క్రికెటర్లకు ప్లేయర్లకు రోజుకు రూ.50వేలు చెల్లిస్తారు. రిజర్వ్ ప్లేయర్లకు రోజుకు రూ.25వేలు చెల్లిస్తారు. అలాగే జాతీయ టీ20లలో ఆడే ప్లేయర్లకు ఒక మ్యాచ్‌కు రూ.25వేలు, రిజర్వ్ ప్లేయర్లకు ఒక మ్యాచ్‌కు రూ.12,500 చెల్లిస్తారు.
అయితే దేశవాళీ టోర్నీలలో ఒక మహిళా క్రికెటర్ అన్ని ఫార్మాట్లలోనూ ఆడితే ఒక సీజన్‌కు ఏకంగా రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుందని బీసీసీఐ అధికారులు తెలిపారు. ఇక కేవలం సీనియర్ ప్లేయర్లే కాకుండా అండర్ 23, అండర్ 19 విభాగాలకు చెందిన మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలను పెంచినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అండర్ 23, అండర్ 19 ప్లేయర్లకు ఒక రోజుకు రూ.25వేలు చెల్లిస్తారు. అలాగే రిజర్వ్ ప్లేయర్లకు రోజుకు రూ.12,500 చెల్లిస్తారు. ఇక మహిళా క్రికెట్‌కు సంబంధించి పనిచేసే మహిళా అంపైర్లు, మహిళా అధికారులు, ఇతర మహిళా సిబ్బందికి కూడా వేతనాలను పెంచినట్లు బీసీసీఐ తెలియజేసింది.
దేశవాళీ టోర్నీల్లో ఒక మ్యాచ్‌కు ఒక అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీకి రోజుకు రూ.40వేలు చెల్లిస్తారు. అదే నాకౌట్ మ్యాచ్‌లలో అయితే రోజుకు రూ.50వేల నుంచి రూ.60వేలు చెల్లిస్తారు. దీని వల్ల రంజీ ట్రోఫీ లాంటి టోర్నీల్లో అంపైర్లు ఒక మ్యాచ్ కు రూ.1.60 లక్షలు పొందే చాన్స్ ఉంటుంది. అలాగే అలాంటి టోర్నీలలో నాకౌట్ గేమ్‌లలో ఒక మ్యాచ్‌కు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పొందుతారు. కాగా తాము తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది మహిళా క్రికెటర్లు, అంపైర్లకు మేలు జరుగుతుందని, దీని వల్ల ఈ రంగంలోకి రావాలనుకునే మహిళల కోసం మరింత ప్రేరణ లభిస్తుందని తాము భావిస్తున్నామని బీసీసీఐ తెలియజేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



