IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ఫిక్స్ – 12 స్టేడియాల్లో యాభై మ్యాచ్‌లు
ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్‌ను గురువారం బీసీసీఐ ఖరారు చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో సెకండ్ ఫేజ్ మొదలుకానున్నట్లు వెల్లడించింది.
IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 సెకండ్ ఫేజ్ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం రివీల్ చేసింది. ఈ సెకండ్ ఫేజ్‌లో ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు మొత్తం యాభై మ్యాచ్‌లు జరుగనున్నాయని వెల్లడించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఐపీఎల్‌ను రెండు ఫేజ్‌లుగా విభజించింది బీసీసీఐ. ఫస్ట్ ఫేజ్ మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగనుంది. ఇందులో పది వేదికల్లో ఇరవై మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇప్పటికే తొలి దశలో మ్యాచ్‌లు జరుగనున్న వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది..
సెకండ్ ఫేజ్...
తాజాగా సెకండ్ ఫేజ్ డేట్స్‌తో పాటు స్టేడియం వివరాలను గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు సెకండ్ ఫేజ్‌లో మొత్తం యాభై మ్యాచ్‌లో నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. సెకండ్ షెడ్యూల్ కోసం పన్నెండు స్టేడియాలనే ఖరారు చేశారు. హైదరాబాద్‌తో పాటు , బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్‌లలో మ్యాచ్‌లు జరుగబోతున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఉప్పల్ మ్యాచ్‌తో...
ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ సెకండ్ ఫేజ్ ప్రారంభంకానుంది. రెండో దశ ఐపీఎల్‌లో మొత్తం ఎనిమిది డబుల్ హెడర్ మ్యాచ్‌లను (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉండబోతున్నాయి. ప్లేఆఫ్స్‌తో వేదికలతో పాటు డేట్స్‌ను త్వరలోనే ఖరారు చేస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి మే 31 వరకు మొత్తం రెండు నెలల పాటు జరుగనుంది. మొత్తం 84 మ్యాచ్‌లను నిర్వహించబోతున్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



