త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SA vs AFG | థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం.. డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓడిన అఫ్ఘ‌నిస్తాన్‌

SA vs AFG | ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస‌క్తిక‌ర పోరు జ‌రిగింది. గ్రూప్‌-డీలో భాగంగా బుధ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా అఫ్ఘ‌నిస్థాన్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మ్యాచ్ న‌రాలు తెగేలా ఆద్యాంతం ఉత్కంఠ‌గా సాగింది. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ప్రొటీస్ జ‌ట్టు 5 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

P

Sports | Published On Feb 11, 2026, 4.43 pm IST

SA vs AFG | థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం.. డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓడిన అఫ్ఘ‌నిస్తాన్‌
Advertisement

SA vs AFG | ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస‌క్తిక‌ర పోరు జ‌రిగింది. గ్రూప్‌-డీలో భాగంగా బుధ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా అఫ్ఘ‌నిస్థాన్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మ్యాచ్ న‌రాలు తెగేలా ఆద్యాంతం ఉత్కంఠ‌గా సాగింది. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ప్రొటీస్ జ‌ట్టు 5 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. రెండో సూప‌ర్ ఓవ‌ర్‌లో డేవిడ్ మిల్ల‌ర్‌, ట్రిస్టన్ స్ట‌బ్స్‌ కలిసి 23 రన్స్ చేయ‌గా.. అఫ్ఘనిస్థాన్ 19 రన్స్ మాత్రమే చేయగలిగింది. రహ్మానుల్లా గుర్బాజ్ జ‌ట్టును గెలిపించేందుకు పోరాడినా.. అనుకూల‌మైన ఫ‌లితం ద‌క్క‌లేదు. తొలుత అఫ్ఘనిస్థాన్ తొలి సూపర్ ఓవర్‌లో 17 రన్స్ చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా.. గుర్బాజ్ మ‌రో రెండ్‌లో స‌హ‌కారం అందించాడు. అంత‌కు ముందు తొలి సూప‌ర్ ఓవ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా త‌ర‌ఫున డేవిడ్ మిల్ల‌ర్‌, బ్రెవిస్ బ్యాటింగ్ ప్రారంభించారు.

ఫరూకీ బౌలింగ్‌లో మిల్ల‌ర్ తొలి బంతికి సింగిల్ తీశాడు. రెండో బంతికి బ్రెవిస్ సిక్స‌ర్ బాదాడు. మూడో బంతికి బ్రెవిస్ అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి స్ట‌బ్స్ ఫోర్ తీశాడు. ఐదో బంతికి ఒక్క ప‌రుగు రాలేదు. దక్షిణాఫ్రికాకు స్కోర్‌ని స‌మ‌యం చేసేందుకు ఆరు ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. గెలిచేందుకు ఏడు ప‌రుగులు కావాలి. చివ‌రి బంతికి స్ట‌బ్స్ సిక్స‌ర్ బాది స్కోర్‌ను స‌మం చేయ‌డంతో డబుల్ సూప‌ర్ ఓవ‌ర్ ఆడాల్సి వ‌చ్చింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), ర్యాన్ రికెల్టన్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. అఫ్ఘ‌న్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (3/41) మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. రషీద్ ఖాన్(2/28) రెండు, ఫజలక్ ఫరూఖీకి ఒక వికెట్ ద‌క్కింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన అఫ్ఘ‌న్ జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 187 ప‌రుగులు చేసింది.

రెహ్మానుల్లా గుర్బాజ్(42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) సెంచ‌రీని మిస్స‌య్యాడు. చివ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 13 ప‌రుగులు అవ‌స‌రం. ర‌బ‌డా నోబాల్‌, వైడ్ వేశాడు. రెండో బంతిని నూర్ అహ్మ‌ద్ సిక్స‌ర్ కొట్టాడు. మ‌ళ్లీ ర‌బ‌డా నాలుగో బంతిని నోబాల్ వేయ‌డంతో ఒకే బంతికి మూడు ప‌రుగులు వ‌చ్చాయి. దాంతో చివ‌రి రెండు బంతుల్లో రెండు ప‌రుగులు అవ‌స‌మ‌య్యాయి. నాలుగో బంతికి సింగిల్ తీసిన అనంత‌రం డ‌బుల్ తీసే ప్ర‌య‌త్నంలో ఫ‌రూకీ ర‌నౌట్‌గా వెనుదిరుగ‌డంతో స్కోర్కు స‌మ‌య్యాయి. దాంతో సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది.

Advertisement
Advertisement