త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Solar Eclipse | ఈ ఏడాది తొలి సూర్య‌గ్ర‌హ‌ణం రేపే..! కంక‌ణాకార గ్ర‌హ‌ణం భార‌త్‌లో ద‌ర్శ‌నమిస్తుందా?

Solar Eclipse | ఈ ఏడాది తొలి సూర్య‌గ్ర‌హ‌ణం మంగ‌ళ‌వారం ఏర్ప‌డ‌నున్న‌ది. ఈ సారి కంక‌ణాకార సూర్య‌గ్ర‌హ‌ణం క‌నువిందు చేయ‌నున్న‌ది. ఈ గ్ర‌హ‌ణం ద‌క్షిణాఫ్రికా, అర్జెంటీనా, అంటార్కిటితో పాటు ప‌లు ప్రాంతాల్లో క‌నిపించ‌నున్న‌ది.

P

Science | Published On Feb 16, 2026, 3.18 pm IST

Solar Eclipse | ఈ ఏడాది తొలి సూర్య‌గ్ర‌హ‌ణం రేపే..! కంక‌ణాకార గ్ర‌హ‌ణం భార‌త్‌లో ద‌ర్శ‌నమిస్తుందా?
Advertisement

Solar Eclipse | ఈ ఏడాది తొలి సూర్య‌గ్ర‌హ‌ణం మంగ‌ళ‌వారం ఏర్ప‌డ‌నున్న‌ది. ఈ సారి కంక‌ణాకార సూర్య‌గ్ర‌హ‌ణం క‌నువిందు చేయ‌నున్న‌ది. ఈ గ్ర‌హ‌ణం ద‌క్షిణాఫ్రికా, అర్జెంటీనా, అంటార్కిటితో పాటు ప‌లు ప్రాంతాల్లో క‌నిపించ‌నున్న‌ది. గ్ర‌హ‌ణం స‌మ‌యంలో సూర్యుడిని చంద్రుడు దాదాపు 96శాతం క‌ప్పేస్తాడు. దాంతో సూర్యుడి చుట్టూ అగ్నివ‌ల‌యంలా క‌నిపిస్తుంది. ఈ దృశ్యం రెండు నిమిషాల 20 సెక‌న్ల పాటు క‌నువిందు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ది.

సాధార‌ణంగా భూమి, సూర్యుడి మ‌ధ్య‌కు చంద్రుడు వ‌చ్చిన స‌మ‌యంలో సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డుతుంది. ఆ స‌మ‌యంలో సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుగా వ‌చ్చిన‌ప్పుడు సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం క‌నిపిస్తుంది. పాక్షికంగా క‌ప్పేసిన స‌మ‌యంలో పాక్షిక గ్ర‌హ‌ణం ద‌ర్శ‌నిమ‌స్తుంది. ఈసారి చంద్రుడు-భూమికి సాధారణం కంటే ఎక్కువ దూరం ఉండ‌డంతో సూర్యుడిని పూర్తిగా క‌ప్పివేయ‌లేడ‌ని.. దాంతో భానుడి చుట్టూ వ‌ల‌యంగా క‌నిపిస్తుంద‌ని దాన్నే రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తార‌ని శాస్త్రవేత్త‌లు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా అరుదుగా క‌నిపిస్తాయ‌ని తెలిపారు.

ఈ గ్ర‌హ‌ణం మ‌ధ్యాహ్నం 3.26 గంట‌ల‌కు ప్రారంభ‌మై 5.42 గంట‌ల‌కు గ‌రిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. సాయంత్రం 7.57 గంట‌ల‌కు ముగుస్తుంది. అంటార్కిటికా మీదుగా గ్ర‌హ‌ణం వెళ్తుంది. దక్షిణ అమెరికా, దక్షిణ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణం క‌నిపిస్తుంది. అంటార్కిటికా, అర్జెంటీనా, బోట్స్వానా, బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతం, చిలీ, కొమొరోస్, ఎస్వాటిని, ఫ్రెంచ్ దక్షిణ భూభాగాలు, లెసోతో, మడగాస్కర్, మలావి, మారిషస్, మయోట్టే, మొజాంబిక్, నమీబియా, రీయూనియన్ దీవులు, దక్షిణాఫ్రికా, దక్షిణ జార్జియా, టాంజానియా, జాంబియా, జింబాబ్వేలలో ఈ గ్ర‌హ‌ణం క‌నువిందు చేయ‌నున్న‌ది. ఈ గ్ర‌హ‌ణం భార‌త్‌లో క‌నిపించ‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ ఏడాది ఆగ‌స్టు 12న మ‌రో సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నున్న‌ది. ఈ గ్ర‌హ‌ణం సైతం భార‌త్‌లో క‌నిపించ‌దు.

Advertisement
Advertisement